సైన్యంలో తొలి కరోనా కేసు: భారత జవాన్‌కు పాజిటివ్!

  • Published By: vamsi ,Published On : March 18, 2020 / 12:44 AM IST
సైన్యంలో తొలి కరోనా కేసు: భారత జవాన్‌కు పాజిటివ్!

Updated On : March 18, 2020 / 12:44 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో కూడా రోజురోజుకు విస్తరిస్తుంది. అయితే కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీకి కూడా పాకింది అనే విషయం ఇప్పుడు కంగారు పెట్టేస్తుంది. లడఖ్ స్కౌట్స్‌లో పనిచేసే ఓ జవాన్‌కు కోవిడ్-19 సోకినట్లుగా ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. జవాన్ తండ్రికి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు.

జవాన్ తండ్రి ఇరాన్‌లో తీర్థయాత్రల కోసం వెళ్లి పర్యటించి ఇటీవలే ఇండియాకు తిరిగి రాగా కరోనాను అక్కడ నుంచి తెచ్చుకున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. జవాన్ కుటుంబలో మిగిలిన సభ్యులకు కూడా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఇండియన్ ఆర్మీతో వ్యక్తికి రావడంతో సైన్యం అప్రమత్తం అయ్యింది. వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

మనదేశంలో ఇప్పటి వరకు 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఒక్క మహారాష్ట్రలోనే 36 మందికి వైరస్ సోకింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు 7,896 మంది చనిపోయారు. మరో లక్షా 94వేల మంది ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జవాన్ కుటుంబంలోని సోదరి, భార్య కూడా లడఖ్‌లో నిర్బంధంలో ఉండి పర్యవేక్షణలో ఉన్నారు.