తెలుగు రాష్ట్రాల్లో కరోనా హాట్ స్పాట్‌లు ఇవే

‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ అంటే రెడ్ జోన్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 హాట్ స్పాట్ కేంద్రాలు, నాన్ హాట్ స్పాట్ కేంద్రాలు, గ్రీన్ జోన్లను గుర్తించినట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 11జిల్లాలు.. తెలంగాణలో 28జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు:
కర్నూలు
గుంటూరు
నెల్లూరు
ప్రకాశం
కృష్ణా
కడప
పశ్చిమగోదావరి
తూర్పుగోదావరి
చిత్తూరు
విశాఖపట్టణం
అనంతపురం
తెలంగాణలో కరోనా హాట్‌స్పాట్ జిల్లాలు:
హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్. నల్గొండను కరోనా క్లస్టర్స్ కలిగిన హాట్‌స్పాట్ జిల్లాగా పేర్కొంది కేంద్రం.
తెలంగాణలో ఆరెంజ్ జోన్ జిల్లాలు:
సూర్యాపేట
ఆదిలాబాద్
మహబూబ్‌నగర్
కామారెడ్డి
వికారాబాద్
సంగారెడ్డి
మెదక్
ఖమ్మం
భద్రాద్రి
జగిత్యాల
జనగాం
జయశంకర్
కుమ్రం భీం
ములుగు
పెద్దపల్లి..
నాగర్‌కర్నూల్
మహబూబాబాద్
సిరిసిల్ల
సిద్దిపేట
హాట్‌స్పాట్‌గా ఉన్న జిల్లాల్లో 14 రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకుంటే వాటిని ఆరెంజ్ జోన్‌లో చేర్చుతారు. ఆరెంజ్ జోన్‌లోకి వచ్చిన తర్వాత మరో 14 రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్‌గా మారుస్తారు.