వరుసగా రెండవరోజు 7వేలకు పైగా కరోనా కేసులు..

భారతదేశంలో గత 24 గంటల్లో 7,964 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా రెండవరోజు ఏడు వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం నాటికి 1,73,763కి చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్ ఇదేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
COVID-19కు సంబంధించిన మరణాల సంఖ్య 4,971కి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 82,370 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 265 మరణాలు చోటుచేసుకోగా.. దేశంలో చికిత్స పొందుతున్న కరోనావైరస్ రోగుల సంఖ్య గా ఉంది. మరణాల సంఖ్యలో భారత్ చైనాను కూడా దాటేసింది.
మహారాష్ట్ర తరువాత, తమిళనాడులో అత్యధిక కరోనావైరస్ కేసులు వచ్చాయి. తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది.
దేశంలో కొరోనావైరస్ కారణంగా బాగా దెబ్బతిన్న రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. ఇప్పటివరకు 62,228 కేసులు నమోదయ్యాయి, వీటిలో 2,098 మరణాలు, 26,997 రికవరీలు ఉన్నాయి. తమిళనాడులో 20,246 కేసులు ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో 17,386 కేసులు నమోదవగా.. కోవిడ్ -19 సంఖ్య 17,000 దాటింది. గుజరాత్‌లో ఇప్పటివరకు 15,934 కేసులు నమోదయ్యాయి.
Read: తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 169 కేసులు, 4 మరణాలు