భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ : మోడీ..ఏం చెబుతారో

భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020, మార్చి 18వ తేదీ బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 169కి చేరింది. వీరిలో 14మంది రికవరీ అవగా… మిగతా 155మందికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స కొనసాగుతోంది. విదేశాలనుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతోంది.
కరోనా వైరస్‌పై గురువారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయబోతున్నారు ప్రధాని మోదీ. అయితే మోదీ ఏం చెబుతారు? ఏ నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ 2020, మార్చి 18వ తేదీ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖతో పాటు హోం, విదేశాంగశాఖ, ఆర్మీ ఉన్నతాధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు.
వ్యాధిని అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్, సాయుధ, పారామిలటరీ బలగాలు, విమానయాన సిబ్బంది, మున్సిపల్ స్టాఫ్ చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ప్రధాని.
* ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కోవిడ్ -19
* 171 దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి
* గడిచిన 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదు
* 9వేలకు చేరువైన కరోనా మరణాలు
* బుధవారం 944 మంది కరోనాతో మృతి
* విదేశాల నుంచి వచ్చే వారిలోనే కరోనా లక్షణాలు!
* విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు
* థర్మల్ స్క్రీనింగ్‌కు దొరకుండా ఎత్తుగడలు
* పారా సిటమాల్ మాత్రలతో మ్యానేజ్
* విమానం దిగడానికి గంట ముందే మాత్రలు వేసుకుంటున్న ప్రజలు
* శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో థర్మల్ స్క్రీనింగ్‌లో దొరకని వ్యక్తులు
Read More : కరీంనగర్‌లో కరోనా హై అలర్ట్ : కలెక్టరేట్ రోడ్డు దిగ్భందం..హోటల్స్, దుకాణాలు బంద్