భయం..భయం : భారత్‌లో రెండో కరోనా కేసు 

  • Published By: madhu ,Published On : February 2, 2020 / 04:49 AM IST
భయం..భయం : భారత్‌లో రెండో కరోనా కేసు 

Updated On : February 2, 2020 / 4:49 AM IST

చైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే చైనా నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి శాంపిళ్లను పూణేకు పంపిస్తున్నారు. ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. చైనా వచ్చిన విద్యార్థులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

చైనాలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియకొనసాగుతోంది. తొలివిడతగా నిన్న 324మందిని తరలించగా… ఇవాళ మరికొందరిని తీసుకువచ్చారు.  చైనాకు వెళ్లిన రెండో ఎయిరిండియా విమానం  కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి తిరిగివచ్చింది. ఈ విమానంలో 323మందిని భారత్‌కు తీసుకువచ్చారు.  

మరోవైపు.. కరోనా వైరస్ దృష్ట్యా… చైనా నుంచి భారత్‌కి రప్పించిన పౌరుల్లో… 95 మందిపై అనుమానాలు ఉండటంతో… వారందరినీ మానెసర్‌లోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రంలో ఉంచి… వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మొత్తం 600 బెడ్లు, కావాల్సినన్ని మందులను సిద్ధంగా ఉంచారు.

ఇటు భారత్‌ లోను కరోనా కలవరం పుట్టిస్తోంది. ఇప్పటికే కేరళలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా… తాజాగా మరో వ్యక్తికి కూడా టెస్టుల్లో పాజిటివ్ రిజల్ట్‌ వచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేక వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేశాయి.

Read More : ఎంపీలు పిల్లలకు పాలివ్వొచ్చు