అంతుచిక్కని కరోనా రహస్యం : డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి హాస్పిటల్ కు

పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడాలోని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(GIMS)నుంచి ఇద్దరు పేషెంట్లకు 24గంటల వ్యవధిలో రెండుసార్లు టెస్ట్ లలో కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో గత శుక్రవారం(ఏప్రిల్-10,2020)ఆ ఇద్దరు పేషెంట్లను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.
అయితే అప్పుడే వాళ్ల నుంచి టెస్ట్ ల కోసం మరో శాంపిల్ తీసుకున్నారు. అయితే ఆ శాంపిల్స్ ను టెస్ట్ చేయగా ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో డిశ్చార్జ్ అయిన వాళ్లు మళ్లీ తిరిగి హాస్పిటల్ లో చేరారు. డాక్టర్ల ఇన్వెస్టిగేషన్ తర్వాత పూర్తి వివరాలతో కేంద్రానికి రిపోర్ట్ పంపనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఆ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గౌతమ్ బుధ్థ నగర్ జిల్లాలోనే నోయిడా సిటీ ఉన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు 483 కరోనా కేసులు నమోదుకాగా,ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా హాట్ స్పాట్ లుగా గుర్తించిన గౌతమ్ బుద్ధ నగర్ లోని పలు ప్రాంతాలు మరియు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రదేశాలకు పూర్తిగా సీల్ వేశారు అధికారులు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9వేలు దాటింది. దేశవ్యాప్తంగా 308కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్రఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.