కుష్టు రోగులకు వాడే మందు కరోనా చికిత్సకు!

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం సాగుతూనే ఉంది. విశ్వమంతా ఒక్కటై కరోనా వ్యాక్సిన్ కనుక్కొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగా.. భోపాల్‌లోని ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన మెడిసిన్ ప్రయోగాల్లో కుష్టువ్యాధి రోగులకు ఇచ్చే మెడిసిన్ మెరుగ్గా పనిచేస్తుందని గుర్తించారు. మైకోబాక్టీరియం W అనే ఔషధం నలుగురు కరోనా రోగులకు ఇవ్వగా ముగ్గురు కోలుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ శర్మాన్ సింగ్ వెల్లడించారు.
మైకోబాక్టీరియం W మెడిసిన్ కరోనా రోగులపై పనిచేస్తుందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు భోపాల్‌లోని ఎయిమ్స్‌తోపాటు మూడు ఆసుపత్రులలో ప్రయోగాలు నిర్వహించేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.
దీంతో గత కొన్ని రోజులుగా ఎయిమ్స్ భోపాల్‌లో covid-19 రోగులపై మైకోబాక్టీరియం W(mw) ఔషధ పరీక్షలు జరిగాయని అధికారి తెలిపారు. ఈ ఔషధం సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఫావిపిరావిర్ అనే ఔషధాన్ని కూడా కోవిడ్ రోగులకు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూస్తామని శర్మాన్ సింగ్ తెలిపారు. ట్రయల్స్ కోసం చేరిన నలుగురు రోగులలో, ముగ్గురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు.
కుష్టు వ్యాధి చికిత్సలో మైకోబాక్టీరియం W ఉపయోగించబడింది. ఎయిమ్స్ భోపాల్‌తో సహా దేశంలోని మూడు ప్రధాన ఆసుపత్రులలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్ -19 రోగులపై పరీక్షలు నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.