Covid Booster Shot : కోవిడ్ బూస్టర్ డోస్ పై పూనావాలా కీలక వ్యాఖ్యలు

శంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ గురువారం నాటికి 100 కోట్లు పూర్తవడంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు.

Covid Booster Shot : కోవిడ్ బూస్టర్ డోస్ పై పూనావాలా కీలక వ్యాఖ్యలు

Poonawala

Updated On : October 21, 2021 / 8:53 PM IST

Covid Booster Shot  దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ గురువారం నాటికి 100 కోట్లు పూర్తవడంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఇదో ఓ మైలురాయన్నారు. దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవ్వడంపై ప్రధాని మోదీకి పూనావాలా కృతజ్ణతలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఇండియా కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా సాగుతుండడంతో రెండు డోసులు తీసుకునే వారి సంఖ్య సంవత్సరం చివరినాటికి పెరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా కొవిడ్ బూస్టర్ డోసుపై పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కొవిడ్ బూస్టర్ డోసు అందుబాటులోకి వస్తుందని పూనావాలా తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇది మరింత వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు. వృద్ధులు, అవసరమైన వారికి బూస్టర్‌ డోసులు తగినన్ని మోతాదులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్నవారు, యువత మాత్రం ప్రపంచం రెండు డోసులు పొందే వరకు వేచి ఉండాలని పేర్కొన్నారు.

మరోవైపు,నైతికంగా, మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ప్రపంచ దేశాలకు మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ముందుగా రెండు డోసుల వ్యాక్సిన్ అందించాలని పూనావాలా పేర్కొన్నారు. ఆఫ్రికా అంతటా కనీసం మూడు శాతం వ్యాక్సిన్ లు అందలేదని, ఇక్కడ రెండు డోసుల తర్వాత బూస్టర్‌ డోస్‌పై మాట్లాడుతున్నారన్నారు.

ALSO READ Song On Vaccination : 100 కోట్లమందికి వ్యాక్సిన్ పై ప్రత్యేక గీతం,ఏవీ విడుదల