AFMC Study : కోవిషీల్డ్ తో 93శాతం రక్షణ
దేశంలో కోవిడ్ రెండోదశ విజృంభణ సమమంలో 15 లక్షల మంది డాక్టర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) నిర్వహించిన ఓ అధ్యయనాన్ని ఉదహరిస్తూ..కోవిడ్ వైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని మంగళవారం కేంద్రప్రభుత్వం తెలిపింది.

Covishield
AFMC Study దేశంలో కోవిడ్ రెండోదశ విజృంభణ సమమంలో 15 లక్షల మంది డాక్టర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లపై ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(AFMC) నిర్వహించిన ఓ అధ్యయనాన్ని ఉదహరిస్తూ..కోవిడ్ వైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93శాతం రక్షణ కల్పిస్తోందని మంగళవారం కేంద్రప్రభుత్వం తెలిపింది.
మంగళవారం కోవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీతి ఆయోగ్ సభ్యుడు(హెల్త్)వీకే పాల్…AFMC అధ్యయనం యొక్క వివరాలను వెల్లడించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సెకండ్ వేవ్ సమయంలో వైరస్ నుంచి 93శాతం రక్షణ పొందినట్లు వీకే పాల్ తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 98శాతం మందికి మరణం ముప్పు కూడా తగ్గిందని తెలిపారు.
కోవిడ్ వైరస్ సోకకుండా వ్యాక్సిన్లు 100 శాతం రక్షణ కల్పించినప్పటికీ వైరస్ తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్ల ప్రభావం ఏ మేరకు ఉందనే విషయం తాజా అధ్యయనం తెలియజేస్తుందన్నారు. వైరస్ సోకదని ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం గ్యారెంటీ ఇవ్వలేదని కానీ తీవ్ర అనారోగ్యం బారినపడకుండా కాపాడతాయిని చెప్పారు. కాబట్టి వ్యాక్సిన్ లపై నమ్మకం ఉంచడంతో పాటు అప్రమత్తంగా ఉంటూ అత్యంత జాగ్రత వహించాలని వీకే పాల్ తెలిపారు.