Illegal Power: కరెంట్ దొంగ.. పాక్కుంటూ వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు

ఓ వ్యక్తి విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకూడదని పాకుతూ సైలెంట్ గా వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు.

Illegal Power: కరెంట్ దొంగ.. పాక్కుంటూ వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు

Illegeal Power Line

Updated On : July 15, 2021 / 7:48 AM IST

Illegal Power:’కరెంట్ దొంగతనం నేరం.. చేయకండి ఆ ఘోరం’ అని అధికారులు మొత్తుకుంటున్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిరక్ష్యరాస్యులు, అవగాహన లేని వాళ్లు ఓకే.. కానీ, చదువు పెరుగుతున్న కొద్దీ తెలివిగా దొంగతనాలు చేయడానికి అలవాటుపడుతున్నారు. ఓ వ్యక్తి విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకూడదని పాకుతూ సైలెంట్ గా వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు.

విద్యుత్ చౌర్యం జరుగుతుందని కంప్లైంట్ తీసుకున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారి ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వచ్చాడు. అదే సమయంలో టెర్రస్ పై ఉన్న లింక్ కట్ చేసి తన ఇంటికి పవర్ సప్లై ఇచ్చుకుందామనే క్రమంలో ఒక వ్యక్తి పాకుతూ వచ్చి దొరికిపోయాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని బాల్కనీ నుంచి కింద ఉన్న అధికారులకు కనిపించకుండా పాకుతూ.. వచ్చాడు. టెర్రస్ పై ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ లో వైర్లు కలిపేందుకు ట్రై చేశాడు. ఇదంతా గమనిస్తూ పై నుంచి వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ అధికారి నిదానంగా బదులిచ్చాడు. ‘బ్రదర్.. నేనిక్కడే నిల్చొన్నా’ అన్నాడు.

ఆ మాట విని దొరికిపోయా అనే రేంజ్ లో ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు ఆ కరెంట్ దొంగ. యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటి కోసం పోలీస్ స్టేషన్ల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.