మొసలి చావుకు గుడి కట్టి నివాళి : గంగారామ్ అమర్ రహే

ఆ ఊరి చెరువులో వున్న మొసలి చనిపోయిందని ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది.తిండి తినకుండా...నిద్ర పోకుండా ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు.

  • Published By: veegamteam ,Published On : January 11, 2019 / 10:54 AM IST
మొసలి చావుకు గుడి కట్టి నివాళి : గంగారామ్ అమర్ రహే

ఆ ఊరి చెరువులో వున్న మొసలి చనిపోయిందని ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది.తిండి తినకుండా…నిద్ర పోకుండా ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు.

రాయ్‌పూర్: ఆ ఊరి చెరువులో వున్న మొసలి చనిపోయిందని ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది.తిండి తినకుండా…నిద్ర పోకుండా ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ ఊరిలో ఒక్క పొయ్యి కూడా వెలగలేదు. ఊరంతా ఇంతలా ఇలా ఏడవటానికి కారణం ఓ మొసలు చావు. 130 ఏళ్ల నుండి ఆ గ్రామ ప్రజలకు ఆరాధ్య దైవంగా పూజలందుకున్న  మొసలి చనిపోయింది. ఆ చావుతో ఊరంతా విషాదంతో నిండిపోయింది. ఈ ఆసక్తికర..అరుదైన  ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో జరిగింది. 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు 80 కి.మీ. దూరంలోని బెమితార జిల్లా బావ మహోతార గ్రామంలోని చెరువులో వుంటున్న 130 ఏళ్ల వయస్సున్న ఓ మొసలిని ఊరంతా దైవంగా..తమ గ్రామాన్ని రక్షించే దేవుడిగా భావించి పూజిస్తున్నారు. ఆ మొసలికి గంగారామ్ అని పేరుకూడా పెట్టారు. ఈ క్రమంలో 103ఏళ్ల వయసులో ఆ మొసలి చనిపోయింది. ఇంకేముంది ఊరు ఊరంతా కన్నీటి చెలమగా మారిపోయింది. మొసలి చావును తట్టుకోని బావమహోతర గ్రామం మొత్తం నిద్రాహారాలు మాని  కన్నీరు మున్నీరుగా విలపించింది. 

చివరకు గ్రామ ప్రజలంతా సంప్రదాయ పద్ధతిలో, భక్తి ప్రపత్తులతో మొసలి అంత్యక్రియలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా వదలకుండా ఆ భక్తితో మకరాన్ని తాకి కడసారి వీడ్కోలు పలికారు. ఆ మొసలి (గంగారామ్) శతాబ్దానికిపైగా నివసించిన చెరువు ఒడ్డునే స్మారక చిహ్నంతో పాటు  గ్రామంలో మకర దేవాలయం నిర్మించనున్నట్లు గ్రామ సర్పంచ్ మోహన్ సాహు తెలిపారు.

ఈ సందర్భంగా సాహు మాట్లాడుతు..మా తాత తన చిన్నతనంలో గ్రామం చెరువులో ఈ మొసలిని చూశాడనీ..అప్పటి నుండి గ్రామం అంతా ఈ మరకాన్ని దైవంగా పూజించేవారి తెలిపారు.  గ్రామంలోని చిన్నా పెద్దా చెరువులో ఈదుకుంటూ మకరం సమీపంలోకి వెళ్లినా ఎన్నడూ హాని తలపెట్టలేదని తెలిపారు. 3.4 మీటర్ల పొడవు, 250 కిలోల బరువు ఉన్న గంగారామ్ వయస్సు 130 ఏండ్లు ఉంటుందని అటవీశాఖ అధికారి ఆర్కే సిన్హా చెప్పారు.