జ్యోతిష్యం పేరుతో మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.12లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ఎలా అంటే..

జ్యోతిష్యం పేరుతో సాప్ట్ వేర్ ఉద్యోగి నుంచి రూ.12.50లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.

జ్యోతిష్యం పేరుతో మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.12లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. ఎలా అంటే..

Cyber criminals

Updated On : March 27, 2025 / 12:49 PM IST

Software Employees: సైబర్ నేరాగాళ్ల భారినపడి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్తకొత్త ఎత్తులతో ప్రజలను బురిడీ కొట్టించి సైబర్ నేరగాళ్లు జేబులు నింపుకుంటున్నారు. సైబర్ నేరాలపై ప్రభుత్వం ఓవైపు అవగాహన కల్పిస్తున్నా ఈ మోసాలకు అడ్డుకట్ట పడటంలేదు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోతున్న వారిలో ఉన్నత విద్యావంతులు కూడా అధికంగానే ఉంటుండటం ఆందోళనకర విషయం. తాజాగా. ముంబైలో ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి ఏకంగా రూ.12లక్షలను పోగొట్టుకున్నాడు.

Also Read: పాస్టర్‌ ప్రవీణ్‌ కేసు.. కీలకమైన పోస్టుమార్టం రిపోర్ట్.. అనుమానాస్పద సీసీ పుటేజ్ లభ్యం

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ కు చెందిన 25ఏళ్ల సాప్ట్ వేర్ ఇంజనీర్ తన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారంకోసం జ్యోతిష్యాన్ని తెలుసుకోవడానికి ఈ ఏడాది జనవరి నెలలో ‘డివైన్ టాక్’ అనే జ్యోతిష్య యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అందులో నిశాంత్ అనే నకిలీ స్పిరిచువల్ గైడ్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. నీవు రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కోబోతున్నావ్.. నీ జీవితం సంతోషంగా సాగాలంటే కొన్ని పూజలు చేయాలి. అందుకు ముందుగా రూ.6300 చెల్లించాలి అంటూ చెప్పాడు. నిశాంత్ మాటలు నమ్మిన యువకుడు ఆ మొత్తాన్ని చెల్లించాడు.

Also Read: Solar Eclipse 2025 : సూర్యగ్రహణం ఎప్పుడు? ఎన్ని గంటలకి? మనకి ప్రభావం ఉందా? ఏం చేయాలి? ఏం చేయొద్దు?

డబ్బులు చెల్లించిన తరువాత బడే మహారాజ్ అనే మరో వ్యక్తిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువకుడికి పరిచయం చేశాడు. అతనే పూజలు చేస్తాడని నిశాంత్ చెప్పాడు. ఆ తరువాత బడే మహారాజ్, యువకుడు వీడియోకాల్ ద్వారా మాట్లాడుకున్నారు. పూజలు మొదలు పెట్టేందుకు ముందుగా రూ.15300 ఇవ్వాలని బడే మహారాజ్ సూచించాడు. ముందుగానే కొంతమొత్తాన్ని చెల్లించానని యువకుడు చెప్పగా.. అది కన్సల్టెన్సీ ఫీజు మాత్రమే.. పూజా కార్యక్రమాలు ప్రారంభించాలంటే ఈ సొమ్ము చెల్లించాలని చెప్పాడు. దీంతో యువకుడు యూపీఐ ద్వారా రూ.15300 చెల్లించాడు. పూజ మధ్యలో అనేక సాకులు చెప్పి రూ.28వేలు వసూళ్లు చేశాడు.

 

పూజ అసంపూర్తిగా జరిగిందని, మధ్యలో పూజను ఆపడం వల్ల నీ ప్రాణాలకే ముప్పు వస్తుందని యువకుడ్ని బడే మహారాజ్ భయపెట్టాడు. అలా భయపెడుతూ జనవరి నెల నుంచి మార్చి నెల మధ్యలో పలు దఫాలుగా డబ్బులు వసూళ్లు చేశాడు. ఇలా మొత్తం రూ.12.50లక్షలు వసూలు చేశాడు. చివరికి ఇదంతా మోసమని తెలుసుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు రంగంలోకిదిగి సైబర్ నేరగాళ్లను గుర్తించే పనిలో పడ్డారు.