DCGI : కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్‌‌కు DCGI అనుమతి

డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి. టీకా ధర బహిరంగ మార్కెట్ లో రూ. 275గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రూ. 150...

DCGI : కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్‌‌కు DCGI అనుమతి

DCGI approved

Updated On : January 27, 2022 / 4:14 PM IST

Covaxin And Covishield : కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు కీలకంగా మారిన వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ లు వంద శాతం పూర్తి కాగా..మరికొన్ని రాష్ట్రాల్లో డబుల్ డోస్ లు వంద శాతానికి చేరువగా ఉన్నాయి. భారతదేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు ఇతర కొన్ని కంపెనీల డోసులు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను బహిరంగ మార్కెట్ లో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.

Read More : Jammu Kashmir : శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు

డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలో టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి. టీకా ధర బహిరంగ మార్కెట్ లో రూ. 275గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి రూ. 150 సేవా రుసుము అదనంగా విధించే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రైవేటు లో కోవాగ్జిన్ ఒక డోసు ధర రూ. 1200, కోవిషీల్డ్ రూ. 780 (సేవా రుసుంతో కలిపి)గా ఉంది. గత సంవత్సరం జనవరి 03వ తేదీన అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఈ రెండు టీకాలకు డీసీజీఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతినివ్వాలని జనవరి 09వ తేదీన ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సాధారణ అనుమతి కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు అవసరమైన సమాచారం ఇచ్చింది.

Read MoreChiranjeevi-CM KCR: మెగాస్టార్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం కేసీఆర్!

భారత్ లో తయారయ్యే కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ DCGI అనుమతి కోరాయి. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఎంత ఉండాలన్న అంశంపై ఒక నివేదిక ఇవ్వాలంటూ DCGI.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)ను కోరింది. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఆరు నెలలు / ఏడాది కాలం వ్యవధిలో బూస్టర్ డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో టీకాలు ప్రజలందరికి చేరువయ్యేలా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయడం ఉత్తమమని ఫార్మా సంస్థలు భావించాయి.