ఆదివారం పనిచేయకపోయినా జీతాలివ్వండి: మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ.. గురువారం కరోనాపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆదివారం జనతా కర్ఫ్యూలో విజయవంతంగా పాల్గొనాలని కోరారు. అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. ఈ మేరకు వర్క్ ప్లేస్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఆయా సంస్థల యజమానులు జీతాలివ్వాలని కోరారు. (నిర్మానుష్యంగా అలిపిరి : కరోనా భయం..మార్గాలను మూసేసిన టీటీడీ)
‘మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మనిషిలా, సెన్సిటివ్‌గా ఆలోచించండి. వేతనాలు కట్ చేయకండి’ అని మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా తయారైన కరోనాపై పోరాడేందుకు మానవత్వంతో స్పందించాలని కోరారు. పలు నగరాలు లాక్ డౌన్ అవుతున్న కారణంగా రోజువారీ కూలీ చేసుకునే వారికి ఇబ్బందిగా మారొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవాళ్లలాగే అందరికీ చేసుకునే వెసలుబాటు ఉండకపోవచ్చు కదా.
ప్రజలు కంగారు పడొద్దు. నిత్యవసరాల సరఫరా, మందుల సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. ఆదివారం (మార్చి-22, 2020) దేశప్రజలెవరూ ఇళ్లల్లోనుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటిద్దాం. ఉదయం 7 గంటలనుంచి రాత్రం 9గంటల వరకు దీన్ని పాటిద్దాం అని మోడీ పిలుపునిచ్చారు. ఆ రోజు 5 సాయంత్రం గంటలకు అందరూ బైటికి వచ్చి 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి, కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఇలా చేయాలని మోడీ చెప్పారు.
కరోనాను అరికట్టేందుకు ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పడే ఉపశమనం లభించే అవకాశం కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాలు మీ సమయం నాకు ఇవ్వాలని కోరుతున్నా. అందరం చేయి చేయి కలిపి కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాలి. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు ఎలాంటి మార్గం కనిపెట్టలేకపోయారు. కరోనా కబలిస్తున్న దేశాల్లో మొదట బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నా..రాను రాను సంఖ్య పెరిగిపోతుందని ప్రధాని అన్నారు.