Delhi Assembly Election 2020: ఢిల్లీ అంటే బీజేపీకి ఎందుకంత భయం

Delhi Assembly Election 2020: ఢిల్లీ అంటే బీజేపీకి ఎందుకంత భయం

Updated On : February 5, 2020 / 6:26 AM IST

ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారతీయ జనతా పార్టీ పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 2019ఎన్నికల్లో బీజేపీ దేశ రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలను సొంతం చేసుకుంది. ఓటింగ్ వాటాలో బీజేపీ 57శాతం దక్కించుకోగా, ఆప్ మాత్రం మూడో స్థానం ఓట్లను మాత్రమే సంపాదించగలిగింది. ఇంతవరకూ చూస్తుంటే బీజేపీకే అనుకూలంగా ఉందా అనిపిస్తుంది. కానీ, అక్కడ పరిస్థితి అలా లేదు.

అధికారంలో ఉండి రాష్ట్రమంతా తమ ఆధీనంలో ఉన్నప్పటికీ కేంద్రం లిమిట్స్ పెడుతూనే ఉంది. ఈసారి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధికారం చేజిక్కితే బీజేపీకి ఇక అడ్డు ఉండదని భావిస్తుంది. మరోవైపు షహీన్ బాగ్ ఆందోళన ఫలితంగా సైలెంట్‌గా ఆఫ్ కు మంచి మెజార్టీ వస్తుందని లెక్కలేస్తుంది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు బీజేపీకి తలనొప్పిగా మారతాయని అనుకుంటున్నారు. 

ఢిల్లీలో బీజేపీ ఫేవరేట్ కాకపోవడానికి రెండు ప్రధాన కారణాలు.. ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుకాకపోవడం, రెండోది బీజేపీ మాదిరిగా హిందూత్వ రాజకీయాలు కాకుండా.. పాలనాపరమైన ఆలోచనలతో ముందుకెళ్తుండటం. 

ఓ వైపు మరోసారి గెలిచి ఢిల్లీలో ఎన్నికై.. రాష్ట్ర మొత్తం అధికారాన్ని సంపాదించుకోవాలని ఆప్ ప్రయత్నిస్తుంటే.. దాదాపు దేశం మొత్తం సంపాదించిన ఆధిపత్యాన్ని దేశరాజధానిలోనూ కొనసాగించాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది.

గతంలో లేనంతగా 2019పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలోని ఎంపీ స్థానాలన్నీ బీజేపీ గెలవడంతో వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక సర్వేల్లో మాత్రం మరోసారి ఆప్‌కే పట్టం కట్టనున్నట్లు చెబుతున్నాయి. ఆప్ 53 – 56 సీట్లు గెలుస్తుంద‌ని, బీజేపీ 12 – 15 సీట్లు గెలుచుకోవ‌చ్చ‌ని అంచనా.