ఢిల్లీలో సరి-బేసి విధానం…ఉల్లంఘిస్తే రూ.4వేలు ఫైన్

నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు.టూవీలర్లు మినహాయిస్తున్నామని ఆయన తెలిపారు.
ఆదివారం కాకుండా వారంలోని మిగతా ఆరు రోజుల్లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8గంటల వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ.4వేలు జరిమానా విధించబడుతుందనిఆయన తెలిపారు.
రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,ప్రధానమంత్రి,గవర్నర్లు,సీజేఐ,లోక్సభస్పీకర్,కేంద్రమంత్రులు,రాజ్యసభ,లోక్ సభ ప్రతిపక్ష నేతల వాహనాలు,సీఎంల వాహనాలను సరి-బేసి విధానం నుంచి మినహాయిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. స్కూల్ యూనిఫాం ధరించిన విద్యార్ధులను తరలించే వాహనాలను కూడా ఈ విధానం నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా తాము ఇలాచే చేశామని తెలిపారు.
అయితే ఈ సరి-బేసి విధానం నుంచి ఢిల్లీ సీఎం,మంత్రులకు మాత్రం మినహాయింపు ఉండదని ఆయన తెలిపారు. పొల్యూషన్ ను తగ్గించడంలో తీసుకునే చర్యల్లో భాగంగా రాత్రి-పగలు జరుగుతున్న నిర్మాణ స్థలాలను,చెత్తను తగులబెడుతున్న స్థలాలను తనిఖీ చేసేందుకు 16 విజిలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.