Moinabad Farmhouse Row : తెలంగాణలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’షురూ చేసింది..కానీ ప్లాన్ ప్లాప్ అయ్యింది : మనీశ్ సిసోడియా
తెలంగాణలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’షురూ చేసింది..కానీ ప్లాన్ ప్లాప్ అయ్యింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలన కొనటానికి కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన బ్రోకర్టు అడ్డంగా బుక్ అయ్యారు అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.

Delhi deputy CM manish sisodias comments on buying trs mlas Trap issue
Moinabad Farmhouse Row: మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కోసం కుట్ర అనే అంశంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. బీజేపీపై విమర్శలు సంధిస్తూ..‘బీజేపీ తెలంగాణలో ‘ఆపరేషన్ లోటస్’మొదలుపెట్టిందని దాంట్లో బాగమే మొయినాబాద్ ఫాం హౌజ్ ఘటన అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు.
తెలంగాణలో ఆపరేషన్ లోటస్ మాత్రం బట్టబయలు అయ్యిందని..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొలుగోలు చేయటానికి వచ్చిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయి బ్రోకర్లు పట్టుబడ్డారు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో 43మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనేద్దామని బీజేపీ ప్లాన్ వేసింది. ఆప్ పార్టీని చీల్చటానికి కుట్రలు పన్నుతోందని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలను కొటానికి రూ.1,075 కోట్లు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు సిసోడియా.
ప్రజల ఓట్లతో గెలిసిన ఎమ్మెల్యేలను కొనేసి ప్రభుత్వాలను కూల్చటమే పనిగా బీజేపీ పెట్టుకుందని దీని కోసం కోటాను కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని అన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఆపరేషన్ లోటస్ బట్టబయలు అయ్యిందని బీజేపీ గుట్టు బటయపడిందని అన్నారు. రూ.100 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని వచ్చిన బ్రోకర్లు అడ్డంగా బుక్ అయ్యారని అన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో బీజేపీ కొత్త డ్రామాలు ఆడుతోందన్నారు. ఆపరేషన్ లోటస్ లో భాగమైన ముగ్గురు బ్రోకర్లకు బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలున్నాయని ఆరోపించారు.