కేజ్రీవాల్ అరెస్ట్‌ చివరిది కాదా? మరిన్ని అరెస్టులు ఉంటాయా? వీరు కూడా అరెస్ట్ అవుతారా?

అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాను..లోక్‌సభ ఎన్నికలకు ముందు..

కేజ్రీవాల్ అరెస్ట్‌ చివరిది కాదా? మరిన్ని అరెస్టులు ఉంటాయా? వీరు కూడా అరెస్ట్ అవుతారా?

Arvind Kejriwal

మూడేళ్లుగా డైలీ ఎపిసోడ్ అయిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌తోనే కేసు ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసిందని భావించారంత. కానీ ఈడీ వేస్తున్న అడుగులు.. ఆప్ నేతలు చెప్తున్న మాటలు వింటుంటే..లిక్కర్‌ స్కాం కేసులో మరిన్ని విచారణలు, అరెస్టులు ఉండే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు నోటీసులు ఇచ్చి విచారించింది ఈడీ. విజయ్‌ నాయర్‌కు తన అధికారిక నివాసాన్ని షెల్టర్‌గా ఇచ్చారన్న దానిపై వివరాలు అడిగి తెలుసుకుంది. అయితే కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసు విచారణ ఇంకొంత దూరం వెళ్తుందన్న చర్చకు అవకాశం లభించింది.

విజయ్ నాయర్‌ ద్వారా సౌత్ గ్రూప్‌ నుంచి ఆప్ ముడుపులు తీసుకుందనేది ఈ కేసులో ఈడీ ప్రధాన ఆరోపణ. అయితే విజయ్ నాయర్‌.. తనకు రిపోర్ట్ చేయరని..ఢిల్లీ మంత్రులు అతిషి, భరద్వాజ్‌ కు రిపోర్ట్ చేస్తారని..విచారణలో కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ కోర్టుకు వివరించింది.

ఎవరెవరు అరెస్ట్ అవుతారు?
కేజ్రీవాల్‌ను మరోసారి ఈడీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అంతకముందే పలువురు మరికొందరు ఆప్ నేతలు.. కేసుతో సంబంధం ఉన్న అధికారులకు నోటీసులు ఇచ్చి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మంత్రి అతిషి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ చర్చనీయాంశంగా మారింది.

కొన్ని రోజుల్లో మరికొందరు ఆప్‌ నేతలు అరెస్టు కావొచ్చన్నారామె. ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారో కూడా పేర్లతో వివరించారు. తనతో పాటు అంటే అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దాను..లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు అతిషి.

కేజ్రీవాల్ రాజీనామా చేయరు
ఇక కేజ్రీవాల్ రాజీనామా చేయరని మరోసారి స్పష్టం చేశారు అతిషి. సీఎం రాజీనామా చేయడానికి ఎలాంటి కారణం లేదని తెలిపారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే..ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం బీజేపీకి మరింత ఈజీ అవుతుందని విమర్శించారు అతిషి.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలులో ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్‌సింగ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనవచ్చని.. అయితే కేసుపై ఎలాంటి కామెంట్లు చేయడానికి వీల్లేదని ఆదేశించింది.

Also Read: గుడ్‌న్యూస్.. ఏపీలో ఎన్నికల వేళ పెన్ష‌న్ల పంపిణీపై స‌వ‌రించిన విధివిధానాలు జారీ