Sukhesh Chandrasekhar : మండోలి జైలు అధికారుల నుంచి ముప్పు ఉంది.. నన్ను, నా భార్యను మరో జైలుకు పంపండి : ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సుఖేశ్ చంద్రశేఖర్

తన కుటుంబానికి, తన లాయర్ కి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ జైలులో ఉండడం తనకు సురక్షితం కాదన్నారు.

Sukhesh Chandrasekhar : మండోలి జైలు అధికారుల నుంచి ముప్పు ఉంది.. నన్ను, నా భార్యను మరో జైలుకు పంపండి : ఢిల్లీ ఎల్జీకి లేఖ రాసిన సుఖేశ్ చంద్రశేఖర్

Sukhesh Chandrasekhar

Updated On : July 9, 2023 / 3:42 PM IST

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ మండోలి జైలు నుంచి మరో లేఖ రాసిశారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వికె సక్సేనాకు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు. జైలులో ఉన్న తనను, తన భార్యను మరో జైలుకు పంపాలని, తమకు భద్రత కల్పించాలని ఎల్జీకి సుఖేశ్ విజ్ఞప్తి చేశారు.

తన కుటుంబానికి, తన లాయర్ కి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ జైలులో ఉండడం తనకు సురక్షితం కాదన్నారు. జైలు అధికారుల నుంచే తనకు ముప్పు ఉందని ఎల్జీకి సుఖేశ్ తెలిపారు. తనకి వస్తున్న బెదిరింపులపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి చేసిన ఫిర్యాదును ఎల్జీకి పంపారు.

Uttarakhand Road Accident : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిపోయిన వాహనం, డ్రైవర్ సహా ఆరుగురు గల్లంతు

తన న్యాయవాది అనంత్ మాలిక్ కు వచ్చిన బెదిరింపుల కాల్ రికార్డింగ్స్ ను సుఖేశ్ చంద్ర శేఖర్ ఎల్జీకి పంపారు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ సహా ఆప్ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులు, వాంగ్మూలాలను ఉపసంహరించుకోకుంటే జైలులో తినే ఆహారంలో విషం కలుపుతామని బెదిరించారని పేర్కొన్నారు.

జైలు నిర్వహణ తమ ఆధ్వర్యంలోనే ఉందని తన న్యాయవాదిని బెదిరించారని తెలిపారు. జూన్ 23న, కేజ్రీవాల్ సహచరుడు మనోజ్ తన తల్లిని బెదిరించారని ఆరోపించారు. సత్యేందర్ జైన్ భార్య పూనమ్ జైన్ నుండి తన తల్లికి అనేకసార్లు కాల్స్ వచ్చాయని తెలిపారు. తన వద్ద ఉన్న డేటాను ఇవ్వాలని బెదిరిస్తున్నారని వెల్లడించారు.