News Click: చైనా నిధుల వివాదం.. న్యూస్‌క్లిక్ కార్యాలయం, జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు దాడులు
న్యూస్ క్లిక్ అనేది మీడియా ప్లాట్ ఫారమ్. దీనిని 2009లో సంస్థ యొక్క ఎడిటర్ - ఇన్ - చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ భారతీయ, అంతర్జాతీయ వార్తలను కవర్ చేస్తుంది.

News Click
Delhi Police Raids NewsClick: మనీలాండరింగ్, చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై న్యూస్‌క్లిక్ అనే మీడియా సంస్థ కార్యాలయాలు, ఉద్యోగులు, జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లలో పెద్దఎత్తున దాడులు జరిపింది. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఆధారాల సేకరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. దీనికితోడు సదరు ఉద్యోగులను విచారణలో పాల్గొనాల్సిందిగా వారికి సమన్లు కూడా జారీ చేసినట్లు తెలిసింది.
న్యూస్‌క్లిక్ సంస్థపై చైనాకు అనుకూలంగా స్పాన్సర్డ్ వార్తలను నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. చైనా పౌరుడు నెవిల్ రాయ్ సింఘమ్ నుంచి రూ.38 కోట్లు తీసుకున్నట్లు, తద్వారా భారతదేశంలో చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు న్యూస్‌క్లిక్ పై ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు సోదాలు జరిపిన వారిలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టు అభిసార్ శర్మ కూడా ఉన్నారు. అతను ట్విటర్ లో సోదాల గురించి వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు నా ఇంటి వద్ద దిగారు. నా ల్యాప్ టాప్ ను, ఫోన్ ను తీసుకెళ్లారని పేర్కొన్నాడు. మరో న్యూస్ క్లిక్ జర్నలిస్ట్ భాషా సింగ్ కూడా ట్విటర్ లో ఇలా వ్రాశాడు. చివరిగా ఈ ఫోన్ నుంచి ట్వీట్ చేస్తున్నా. ఢిల్లీ పోలీసులు నా ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు అని తెలిపాడు.
Read Also : Asian Games 2023 : టీ20 క్రికెట్ చరిత్రలో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు
న్యూస్ క్లిక్ అనేది మీడియా ప్లాట్ ఫారమ్. దీనిని 2009లో సంస్థ యొక్క ఎడిటర్ – ఇన్ – చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ భారతీయ, అంతర్జాతీయ వార్తలను కవర్ చేస్తుంది. న్యూఢిల్లీలోని న్యూస్ వెబ్ సైట్ కార్యాలయంపై గతంలో 2021లో ఈడీ దాడులు చేసింది. 2021లో న్యూస్‌క్లిక్‌కి అక్రమంగా వచ్చిన నిధులపై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం తొలిసారిగా కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అయితే, న్యూస్‌క్లిక్ ప్రమోటర్లకు అరెస్టు నుండి ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. అయితే, ఈ ఏడాది ఆగస్టులో మనీలాండరింగ్ కేసులో కోర్టు ఇచ్చిన 2021 ఆర్డర్ ను రద్దుచేయాలని కోరుతూ ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.