Crime news: గర్ల్ ఫ్రెండ్‌ని వేధిస్తోంటే అడ్డుకున్న విద్యార్థి.. అతడిని పొడిచి చంపిన నిందితులు.. మీడియాతో మాట్లాడుతూ స్టూడెంట్ తండ్రి కన్నీరు

నిఖిల్ హత్యపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ కూడా స్పందించారు.

Crime news: గర్ల్ ఫ్రెండ్‌ని వేధిస్తోంటే అడ్డుకున్న విద్యార్థి.. అతడిని పొడిచి చంపిన నిందితులు.. మీడియాతో మాట్లాడుతూ స్టూడెంట్ తండ్రి కన్నీరు

Delhi University student Father

Crime news – Delhi: ఢిల్లీ యూనివర్సిటీ(DU)కి చెందిన ఓ విద్యార్థి(19)ని కొందరు కాలేజ్ క్యాంపస్ వెలుపల పొడిచి చంపడం కలకలం రేపుతోంది. ఆర్యభట్ట కాలేజీలో దూర విద్య ద్వారా చదువుకుంటున్న నిఖిల్ చౌహాన్ ఆదివారం తరగతులకు హాజరుకావడానికి కాలేజీకి వచ్చాడు.

నిఖిల్ గర్ల్ ఫ్రెండ్‌తో మరో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడితో నిఖిల్ గొడవ పడ్డాడు. నిందితుడు మరో ముగ్గురితో కలిసి వచ్చి కాలేజ్ గేటు వెలుపల నిఖిల్ ను కత్తితో పొడిచాడు. అనంతరం నిఖిల్ ను కొందరు ఆసుపత్రికి తరలించారు.

అతడు మార్గమధ్యంలోనే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు నిందతులను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నిఖిల్ తండ్రి సంజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కన్నీరు ఆపుకోలేకపోవడం అందరినీ కలిచివేసింది.

నిఖిల్ హత్యపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలీవాల్ స్పందించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ” ఢిల్లీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ధనవంతులైనా సరే, పేదలైనా సరే ఢిల్లీలో ఎవరూ సురక్షితంగా లేరు. 19 ఏళ్ల ఓ స్టూడెంట్ కాలేజ్ వెలుపల తన స్నేహితురాలితో నిలబడి ఉండగా, ఆమెను కొందరు వేధించారు.

ఆమెను రక్షించడానికి ఆ స్టూడెంట్ ప్రయత్నించాడు. అతడిని దుండగులు పొడిచేశారు. మరో చోట ఇద్దరు మహిళలను కాల్చి చంపారు. ఏం జరుగుతోంది? కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది ” అని అన్నారు.

 

Crime News: రూ.10 వేల అప్పు తిరిగి చెల్లించలేదని.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను కాల్చి చంపిన వడ్డీ వ్యాపారి, అతడి అనుచరులు