Delhi : డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్‌ను చెంప దెబ్బ కొట్టిన మహిళ.. ఆమె విపరీత ప్రవర్తనకు షాకైన నెటిజన్లు
డ్యూటీలో ఉన్న పోలీసు చెంప పగలగొట్టింది ఓ మహిళ. అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె ప్రవర్తనపై కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోగా.. ఆమె ప్రవర్తన వెనుక పోలీసు ఆఫీసర్ పాత్ర ఎంక్వైరీ చేయాలని సూచించారు.

Delhi
Delhi : ఓ మహిళ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని చెంప దెబ్బ కొట్టింది. అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమె ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
@gharkekalesh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ పోలీసు పట్ల దూకుడుగా ప్రవర్తించింది. అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. చెంపదెబ్బ కొట్టింది. ఘర్షణకు కారణం తెలియలేదు కానీ ఆమె ప్రవర్తన చూసేవారిని సైతం ఆందోళనకు గురి చేసింది. మధ్యలో కొందరు జోక్యం చేసుకుని శాంత పరచాలని చూసినా ఆమె దూకుడు ఆపలేదు. కానిస్టేబుల్ పై అరుపులు, కేకలు కంటిన్యూ చేసింది. ఈ వీడియోలో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ప్రవర్తన చూస్తుంటే విపరీతంగా ఉందని బెయిల్ రాకుండా ఆమెపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే మరికొందరు గొడవపై పూర్తి అవగాహన లేకుండా మహిళపై నిందలు వేయకూడదని.. మహిళను రెచ్చగొట్టడం వెనుక పోలీసు ఆఫీసర్ పాత్రపై కూడా ఎంక్వైరీ చేయాలని సూచించారు.
Kalesh b/w A Woman and on-Duty Police officer on Roadpic.twitter.com/lMIaX3eSk6
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 8, 2023