ప్రియమైన బాపూ..మీరు అమరులు : గాంధీ 150వ జయంతి..ఉత్తరాల పోటీ

ప్రస్తుతం సమాజంలోని యువతతో పాటు, చిన్నారులకు పోస్టుకార్డులు, టెలీగ్రాం, ఇన్‌ల్యాండ్ లెటర్లు, రిజిష్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ తపాల సంస్థ ఉత్తరాలపై నేటి తరానికి అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగానే మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఉత్తరాల పోటీలను నిర్వహిస్తోంది.
తపాలా శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతికి రూ.25 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేలు బహుమతులుగా అందజేయనున్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతికి 25 వేల రూపాయలు ఇవ్వనున్నారు.
> అన్ని వయస్సుల వారు పోటీలో పాల్గొనవచ్చు.
> 18 ఏళ్లలోపు ఆ పైబడిన వారిని విభాగాలుగా విభజిస్తారు.
> రాసే ఉత్తరంలో వయస్సు, ఇతర వివరాలను తప్పనిసరిగా జత చేయాలి.
> ప్రియమైన బాపు మీరు అమరులు అనే శీర్షికన జాతీయ ఉత్తరాల రాత పోటీ శీర్షికన ఇన్‌లాండ్ లెటర్‌పై 500 పదాలకు మించకుండా రాసి ఎన్వలప్ కవర్‌లో పెట్టి పోస్టు చేయాలి.
> వివరాలకు జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయాల్లో సంప్రదించాలి.
> ఉత్తరాల పోటీ నవంబర్ 30 వరకు నిర్వహిస్తారు.
> దేశభక్తిని పెంపొదించడంతో పాటు..విద్యార్థుల్లో సృజానాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
> రాష్ట్ర స్థాయి పోటీల ఫలితాలను వచ్చే ఏడాది జనవరి 31న, జాతీయస్థాయి పోటీల ఫలితాలను మార్చి 31న విడుదల చేస్తారు.
Read More : ఒక్కటే గుండె : రెండు తలలు..మూడు చేతుల బిడ్డ జననం