Viral Video : పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలకు గులాబీలతో అభిషేకాలు..
పీరియడ్స్‌లో ఉన్న అమ్మాయిలపై గులాబీల అభిషేకం చేసారు. వారికి గిఫ్ట్స్, స్వీట్స్ పంచారు. వారితో డ్యాన్స్ చేసారు. ఏంటి ఇదంతా? అని ఆశ్చర్యపోతున్నారా? సిద్ధేష్ లోకారే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూడండి.

Viral Video
Viral Video : ఆడవారు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతారు. ఆ సమయం నిజంగా వారికి సవాల్‌గా చెప్పాలి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా చిరునవ్వుతో తమ పనుల్లో చేసుకుంటూ ముందుకి వెళ్తారు. ఆ సమయంలో వారి ఇబ్బందిని అర్ధం చేసుకుంటే చాలు. డిజిటల్ సృష్టికర్త సిద్ధేష్ లోకారే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఆ సమయంలో ఆడవారిపట్ల ఎలా మసలు కోవాలో చెప్పే ఈ వీడియో వైరల్ అవుతోంది.
Irregular Periods : పీరియడ్స్ సక్రమంగా రాకపోవటానికి 5 ప్రధాన కారణాలు !
డిజిటల్ క్రియేటర్ సిద్ధేష్ లోకారే ( sidiously_) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందర్నీ ఆలోచింపచేస్తోంది. పీరియడ్స్ సమయంలో ఆడవారు పడే ఇబ్బందులు.. ఆ సమయంలో వారికి ఇంట్లోవారు ఇవ్వాల్సిన సపోర్ట్‌ను గుర్తు చేసింది. సిద్ధేష్ లోకారే షేర్ చేసిన వీడియో పీరియడ్స్‌లో ఉన్నవారు ఇక్కడ కూర్చోండి అనే నేమ్ ప్లేట్ ఉన్న కుర్చీని చూపిస్తూ ఓపెన్ అయ్యింది. ఆ కుర్చీలో ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వారిపై గులాబీ రేకులతో అభిషేకం చేసారు. పాటలు పాడారు. పూలబొకేలు, కేక్స్, గిప్ట్స్, డాన్స్‌లతో హంగామా చేసారు. చివరిగా వారికి ఆప్యాయంగా ఓ హగ్ కూడా ఇచ్చారు.
UNESCO: పీరియడ్స్‌పై విస్తృత ప్రచారం చేసేందుకు యునెస్కో-విస్పర్ కీలక కార్యక్రమం
సిద్ధేష్ లోకారే అతని స్నేహితులు కలిసి చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియో చూసి కొందరు ఆశ్చర్యపోతే కొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసారు. సిద్ధేశ్ తన పోస్టుకి ‘హెలెన్ కెల్లెర్ చెప్పినట్లుగా ప్రపంచం బాధలతో నిండి ఉన్నా దానిని అధిగమించాలి.. మీరు దానిని అధిగమిస్తూ స్ఫూర్తిని ఇస్తున్నారు. ఇలాంటి సమయాల్లో మీ బలం, మీ ధైర్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో చిరునవ్వుతో ముందుకు సాగగలమని మాకు గుర్తు చేస్తోంది’ అనే శీర్షికతో రాసుకొచ్చాడు. 9.02 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ పొందిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు.
View this post on Instagram