చీర వెనుక దాక్కొని కాదు..హెగ్డే వ్యాఖ్యలపై తబస్సుమ్ ఆగ్రహం

బెంగళూరు : కర్ణాటకలో ఆదివారం కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దినేష్ గుండురావ్ భార్యపై హెగ్డే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయండంటూ ఆదివారం కొడగు జిల్లాలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హెగ్డే.. ఎంపీగా, కేంద్రమంత్రిగా హెగ్డే కర్ణాటక రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ ట్వీట్ చేసిన పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దినేష్ గుండురావ్ ని ముస్లిం మహిళ వెనుక పరుగెత్తిన వ్యక్తిగా అభివర్ణించారు. దినేష్ భార్య తబస్సుమ్ ముస్లిం మహిళ.
హెగ్డే వ్యాఖ్యలపై స్పందించిన తబస్సుమ్.. తాను పాలిటిక్స్ లో లేని ఓ సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొని రాజకీయాలు చేయడం ఆపేయాలని హెగ్డేకు సూచించారు. మరోవైపు హైగ్డే ఆదివారం చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. మహారాష్ట్ర బీజేపీ నేత తెహసీన్ పూనావాలా హిందువైన తన భార్యపై చేతులేని దిగిన ఫొటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. హిందు మహిళపై చేయి వేశాను ఏం చేస్తావో చేసుకోపో అంటూ హెగ్డేకు సవాల్ విసిరారు. హెగ్డే వ్యాఖ్యలు దిగజారుడుతనంగా ఉన్నాయని, ఆయన మంత్రి అవడం దురదృష్టకరమని కర్ణాటక కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.