Divorced couple : విడాకులు తీసుకున్న దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు…ఎందుకంటే…

విడాకులు తీసుకున్న అయిదేళ్ల తర్వాత మాజీ దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్న ఉదంతం ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరానికి చెందిన వినయ్ జైస్వాల్, పూజా చౌదరి 2018వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు....

Divorced couple : విడాకులు తీసుకున్న దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు…ఎందుకంటే…

marriage

Updated On : November 30, 2023 / 1:50 AM IST

Divorced couple : విడాకులు తీసుకున్న అయిదేళ్ల తర్వాత మాజీ దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్న ఉదంతం ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరానికి చెందిన వినయ్ జైస్వాల్, పూజా చౌదరి 2018వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. భర్త గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతుండగా వారు రాజీపడి తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఘజియాబాద్ నగరానికి చెందిన వినయ్ జైస్వాల్, పూజా చౌదరి 2012వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం

అయితే వివాహం అయిన ఒక సంవత్సరంలోనే వారి మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు తీవ్రం కావడంతో, వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి విడాకుల కేసు మూడు కోర్టుల్లో సాగింది. ఘజియాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఐదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత వినయ్, పూజ చివరకు 2018వ సంవత్సరంలో విడిపోయారు. ఈ ఏడాది ఆగస్టులో తన మాజీ భర్త వినయ్‌కు గుండెపోటు రావడంతో ఓపెన్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది.

ALSO READ : Telangana Assembly Election 2023 : నేడే పోలింగ్.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

అతని శస్త్రచికిత్స వార్త మాజీ భార్య పూజకు తెలియగానే, ఆమె తన మాజీ భర్త యోగక్షేమాలు తెలుసుకోవాలనే ఆత్రుతతో అతన్ని కలవడానికి నేరుగా ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో ఇద్దరూ కలిసి కొంత సమయం గడపడంతో వారి మధ్య ప్రేమ మళ్లీ చిగురించింది. దీంతో వారు తమ మధ్య ఉన్న పాత విభేదాలను పక్కనపెట్టి మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకున్న ఐదేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

Divorced couple ties the knot again

Divorced couple ties the knot again

ALSO READ : Telangana : పోలింగ్‌కు వరుణ గండం..! ఆందోళన నింపిన వాతావరణ కేంద్రం ప్రకటన

నవంబర్ 23 వతేదీన వినయ్, పూజ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఘజియాబాద్‌లోని కేవీ నగర్‌లోని ఆర్యసమాజ్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. వినయ్ జైస్వాల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, పూజా చౌదరి పాట్నా నగరంలో టీచర్‌గా పనిచేసేవారు. మొత్తంమీద మాజీ భర్తకు వచ్చిన గుండెపోటు, శస్త్రచికిత్స విడిపోయిన దంపతులను మళ్లీ కలిపింది. ఈ పెళ్లి ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది.