తెలుసుకోండి: మీరు తినేది ఉల్లిపాయలేనా..

తెలుసుకోండి: మీరు తినేది ఉల్లిపాయలేనా..

Updated On : December 10, 2019 / 6:56 AM IST

ఉల్లి డిమాండ్ పెరిగి కేజీ రూ.200కు చేరింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వాడుకుంటున్న పరిస్థితి యావత్ భారతదేశమంతా. ఇదిలా ఉంటే, కొన్ని చోట్ల ఉల్లి కేజీ రూ.40 నుంచి రూ.50కు దొరుకుతున్నాయి. తక్కువ ధరకే దొరుకుతున్నాయని సైజు చిన్నగా ఉన్నా కొనేస్తున్నారు. వాస్తవానికి అవి ఉల్లిపాయలే కావు. కృత్రిమంగా తయారీతో మార్కెట్లోకి వచ్చాయనుకొని ఆరోగ్యానికి హానీ చేస్తాయేమోననే భయమూ అవసరం లేదు. 

వాటిని షాల్లొట్స్ అంటారు. ఉల్లిపాయ రుచిని పోలి ఉంటాయి కానీ, కొంచెం తియ్యగా ఉంటాయి. చాలా ప్రాంతాల్లో వీటిని ఉడకబెట్టకుండా పచ్చిగానే తింటుంటారు. ఎందుకంటే వీటిని వేడి చేస్తే వాటి ఫ్లేవర్ పోతుంది. త్వరగా స్వభావాన్ని కోల్పోతాయి. అందుకే ఉల్లిపాయకే ప్రాధాన్యం ఇస్తుంటారు. మూడు షాల్లొట్స్ ను కలిపితే ఒక ఉల్లిపాయకు సమానం. 

సైజు, షేపులో మాత్రమే కాదు. వీటిలో చాలా తేడాలు ఉన్నాయి. 
 

  ఉల్లి షాల్లొట్స్
చూడటానికి  పెద్దగా పసుపు, ఎరుపు, తెలుపు రంగుల్లో గుండ్రంగా ఉంటాయి.  పొడుగ్గా ఉల్లిపాయల కంటే చిన్న పరిమాణంలో ఉంటాయి. 
ఆరోగ్యానికి బెనిఫిట్‌లు ఫైబర్ ఎక్కువగా దొరకడమే కాకుండా మధుమేహానికి, రక్తపోటుకు మంచి మందు.  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ దొరకడమే కాక, రక్తపోటుకు, కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడతాయి.
క్యాలరీలు 40 72
కార్బొహైడ్రేట్స్ 9.34గ్రా 16.8గ్రా
ప్రొటీన్ 1.1గ్రా 2.5గ్రా
కొవ్వు 0.1గ్రా 0.1గ్రా