Chandrayaan-3 Launch : చంద్రయాన్-3 ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్న రీతు కరిధాల్ ఎవరో తెలుసా? ఆమెకు ‘రాకెట్ ఉమెన్’ అనే పేరు ఎందుకొచ్చింది..
రీతూ కరిధాల్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తన కెరీర్ ను ప్రారంభించింది. 2007లో ఆమెకు ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది.

Ritu Karidhal
Ritu Karidhal: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది. చంద్రయాన్-3 ప్రయోగంకు రీతు కరిధాల్ నాయకత్వం వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్ ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా’ పేరు పొందింది. అంతరిక్ష రంగంలో ఆమెకు ఉన్న విస్తృత అనుభవం కారణంగా ఇస్రో రీతూను చంద్రయాన్-3 ప్రయోగం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీనికి ముందు రీతూ కరిధాల్ చంద్రయాన్-2తో సహా అనేక ప్రధాన అంతరిక్ష ప్రాజెక్టులలో సభ్యురాలు. ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్న శాస్త్రవేత్తలలో రీతూ కరిధాల్ ఒకరు.
రీతూ కరిధాల్ లక్నోలో జన్మించారు. ఆమె పాఠశాల విద్యకోసం లక్నోలోని సెయింట్ ఆగ్నీస్ పాఠశాలలో చదివారు. ఆ తరువాత నవయుగ కన్యా విద్యాలయంలో చేరారు. రీతూ లక్నో యూనివర్శిటీ నుంచి ఫిజిక్స్ లో ఎంఎస్సీ చదివిన తరువాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేయడాని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు వెళ్లారు. ఆమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. రీతు బెంగళూరులో టైటాన్ ఇండస్ట్రీస్ ఉద్యోగి అవినాష్ శ్రీవాస్తవను వివాహం చేసుకుంది. వారికి ఆధిత్య, అనిషా అనే ఇద్దరు పిల్లులు ఉన్నారు.
Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?
రీతూ కరిధాల్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయారు. 2007లో ఆమెకు ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. మంగళయాన్ మిషన్ ప్రయోగంలో భాగస్వామయ్యారు. చంద్రయాన్ -2 ప్రయోగానికి రీతూ కరిధాల్ నాయకత్వం వహించారు. అయితే, ఆ ప్రయోగం విఫలం అయింది. తాజాగా ఆమె చంద్రయాన్ -3 ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆమె అనుభవం ఆధారంగా ఇస్రో 2020లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ప్రయోగంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తవేల్, చంద్రయాన్ -2లో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. వనిత చంద్రయాన్-3 ప్రయోగంలో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.