కూతురికి కరోనా రాకూడదని 2వేల 500కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్

జార్ఖండ్‌లో ఉండే డాక్టర్ కూతురి కోసం 2వేల 500కిలోమీటర్లు ప్రయాణించాడు. మంగళవారం బొకారోలో ఉండే వ్యక్తి 50గంటల పాటు కారులో ప్రయాణించి కూతుర్ని తన వద్దకు తెచ్చుకున్నాడు. ప్రయాణం తర్వాత తిరిగి విధుల్లో చేరాడు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్ చెప్పాడు. రాజస్థాన్ లో చదువుకుంటున్న కూతురికి కరోనా సోకకూడదని క్వారంటైన్ లో ఉంచేందుకు తండ్రి చేసిన ప్రయత్నమిది.
5 రాష్ట్రాలకు ప్రయాణమైన సూపర్ డాడీ:
5రాష్ట్రాలు ప్రయాణించి తనను తీసుకొచ్చాడని సూపర్ డాడీ అంటూ పొగిడేస్తుంది కూతురు. నేను చాలా లక్కీ. మా డాడీ నా కోసం సుదీర్ఘ ప్రయాణం చేశాడని ఆ చిన్నారి చెప్పుకొచ్చింది. ‘మేమొక్క నిమిషం కూడా వృథా చెయ్యలేదు. తిరిగి కారులో ప్రయాణించే సమయంలో నాన్న తీసుకొచ్చిన ఆహారమే తిన్నాం. ఈ ప్రయాణం మాకెంతో గుర్తుండిపోతుంది’ అని అంది.
రాజస్థాన్ లోని కోటాలో ఉండే నా కూతుర్ని తీసుకొచ్చే క్రమంలో నేను కారులోనే క్వారంటైన్ లో ఉన్నాను. మార్గం మధ్యలో జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దాటాను. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సామాన్లు మోసుకెళ్లే ట్రక్కులే కనిపించాయి. చాలా తక్కువ వాహనాలు తిరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి వేరేలా ఉంది. కేవలం పోలీసు వాహనాల తప్పించి ఏవీ కనిపించలేదు.
రోడ్లన్నీ ఖాళీగా ఉంటూ కేవలం బోర్డర్ చెక్ పాయింట్ల వద్ద పోలీసులు మాత్రమే కనిపించారు. ఆ పోలీసులెవరూ సేఫ్టీ కోసం జాగ్రత్తలు పాటించడం లేదు. ఈ క్రమంలో నేను తీసుకెళ్లిన మాస్క్ లు, శానిటైజర్లు వాళ్లకు ఇచ్చానని డాక్టర్ తెలిపారు.
See Also | ఏపీలో రైతుబజార్లలో సామాజిక దూరం, కరోనా కట్టడికి పాటించాల్సింది ఈ సూత్రాన్నే