భార్యను కసితీరా పొడిచాడు, తర్వాత కారుతో తొక్కించిన కిరాతక భర్త

భార్యను కసితీరా పొడిచాడు, తర్వాత కారుతో తొక్కించిన కిరాతక భర్త

Updated On : February 21, 2021 / 10:58 AM IST

Doctor slits wife’s throat : అగ్నిసాక్షిగా తాళి కట్టి ఏడడుగులు నడిచాడు. కష్టంలో, సుఖంలో తోడుంటానని మాటిచ్చాడు. కానీ..అత్యంత దారుణంగా భార్యను చంపేశాడు. కసితీరా కత్తితో పొడిచాడు. అనంతరం బయటకు లాక్కొచ్చి..రోడ్డుపై పడేసి ఆమెపై కారును పోనిచ్చాడు. ఈ  ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ భర్త డాక్టర్ కావడం గమనార్హం.

కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్ (40) Potheri ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా ప్రాక్టిస్ గా చేస్తున్నాడు. కాంచీపురంలో మరో ప్రైవేటు ఆసుపత్రిలో HR గా పనిచేస్తున్న సమీప బంధువు కీర్తనను ప్రేమించాడు. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలోని ఆనంద్ నగర్ లో కీర్తి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. తొలుత ఇల్లరికం అల్లుడిగా గోకుల్ కుమార్ ఉండేవాడు. పిల్లలు కాలేదు. లాక్ డౌన్ సమయంలో గోకుల్ పని ఆపేశాడు.

అయితే..కీర్తన, గోకుల్ కుమార్ మధ్య అభిప్రాయబేదాలు వచ్చాయి. జాబ్ మానేసినప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని స్థానికులు వెల్లడించారు. చివరకు ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల కోసం ఆరు నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు. అయినా..కీర్తన తల్లింట్లోనే వీరు ఉండేవారు.

ఇదిలా ఉండగా…2021, ఫిబ్రవరి 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో దంపతులు గొడవ పడ్డారు. వంటింట్లోకి వెళ్లిన గోపాల్..కత్తి తీసుకొచ్చి కీర్తన గొంతు కోశాడు. కుమార్తెను రక్షించడానికి మనోహర్ వచ్చాడు. అతనిపై కూడా దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను రోడ్డుపై పడేశాడు. అనంతరం కారుతో ఆమెపై దూసుకెళ్లాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో మధురాంతకం పోలీసులు తీవ్రంగా గాయపడిన కీర్తన, మురహరిలను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కీర్తన చనిపోయింది.

Kancheepuram Government Hospital లో చికిత్స పొందుతున్న మనోహర్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. జాతీయ రహదారులపై ఉన్న పెట్రోలింగ్ పోలీసులను అలర్ట్ అయ్యారు. Chennai-Trichy National Highway వద్ద వేగంగా వెళుతున్న గోకుల్ కారును కంట్రోల్ చేయలేకపోయాడు. Arthur toll booth వద్ద కారు బోల్తా పడడంతో గోకుల్ కు గాయాలయ్యాయి. అరెస్టు చేసిన అనంతరం చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.