మహారాష్ట్రలో బీజేపీదే ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : November 18, 2019 / 02:15 AM IST
మహారాష్ట్రలో బీజేపీదే ప్రభుత్వం

Updated On : November 18, 2019 / 2:15 AM IST

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఏర్పడబోతుందా? శివసేనతో కలిసి భారతీయ జనతా పార్టీనే మళ్లీ అధికారం చేపట్టబోతోందా? నెలకు పైగా మహారాష్ట్రలో ఏర్పడిన సంక్షోభానికి శివసేన, బీజేపీలు అడ్డు తెర వెయ్యబోతుందా? అవుననే అంటున్నారు కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠవాలే. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విమర్శలు తీవ్రస్థాయిలో పెరిగిన క్రమంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 

ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలపై తాను కేంద్ర హోంమంత్రి  అమిత్‌షాతో చర్చించినప్పుడు ఆయన ‘అంతా సవ్యంగా సాగుతుంది’ అనే ధీమా వ్యక్తం చేసినట్లు రామ్‌దాస్ మీడియాకు వెల్లడించారు. మీరు మధ్యవర్తిత్వం వహిస్తే ఏమైనా అవకాశం ఉంటుందేమోనని అమిత్‌షాతో మహారాష్ట్ర విషయమై ప్రస్తావనకు తీసుకుని వచ్చినప్పుడు  ‘డోంట్‌ వర్రీ. అంతా సవ్యంగా సాగుతుంది. భాజపా-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని అన్నారని, రామ్‌దాస్‌ అఠవాలే మీడియాకు వివరించారు.

ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో భాజపా-శివసేన మధ్య దూరం పెరగడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారితీసింది. ఈ క్రమంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చర్చలు జరుపుతోంది. ఇవాళ(18 నవంబర్ 2019) గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం అవుతుందనే వార్తలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. 

file:///C:/Users/10tv/Downloads/Transfer-orders-Zone-V.pdf