స్కూల్లో ‘వాటర్ బెల్’ మోగింది..పిల్లలూ నీళ్లు తాగండీ..

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 08:46 AM IST
స్కూల్లో ‘వాటర్ బెల్’ మోగింది..పిల్లలూ నీళ్లు తాగండీ..

Updated On : November 17, 2019 / 8:46 AM IST

స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ  కేరళలోని ఓ  స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది. అదేంటి..స్కూల్స్ లో  ఇన్ బెల్ విన్నాం అవుట్ బెల్ విన్నాం..కానీ  ‘వాటర్ బెల్’ ఏంటీ అనే డౌట్ వస్తుంది కదూ.

వివరాలు..ప్రతీ మనిషి శరీరానికి నీరు ఎంతో అవరసరం.శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్ వస్తుంది. దీంతో అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే స్కూల్ పిల్లలు ఇటువంటి సమస్యలకు గురి కాకూడదనే ఉద్ధేశంతో స్కూల్ లో ‘వాటర్ బెల్’ మోగిస్తున్నారు. ఈ బెల్ మోగితు పిల్లలంతా వాటర్ తాగాలన్నమాట. అదే వాటర్ బెల్. ఈ ఆలోచన మంచి ఫలితాలనిస్తుండటంతో సోషల్ మీడియాలో ‘వాటర్ బెల్’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

కేరళలోని ఈ ‘వాటర్ బెల్’  కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల వారూ దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఏపీలోను..తెలంగాణలోని కొన్ని స్కూళ్లలో  ‘వాటర్ బెల్’  కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని  కర్ణాటకలోని స్కూళ్లలో కూడా ‘వాటర్ బెల్’ ని చేపట్టారు.

శనివారం (నవంబర్ 16)బంజారాహిల్స్‌ రోడ్‌ నం.11లోని ఉదయ్‌నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్లో   ‘వాటర్‌ బెల్‌’ మోగించటంతో పిల్లలంతా హుషారుగా వాటర్ తాగారు. ఒక ఐడియా పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వటాని స్ఫూర్తిగా మారింది.