Mumbai Drug case : బాలీవుడ్‌ను తరలించేందుకు బీజేపీ కుట్ర!

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించేందుకే.. బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు

Mumbai Drug case : బాలీవుడ్‌ను తరలించేందుకు బీజేపీ కుట్ర!

Bollywood

Updated On : October 29, 2021 / 2:24 PM IST

 NCP leader Nawab Malik : ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించేందుకే.. బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నోయిడాలో ఫిల్మ్‌ సిటీని నెలకొల్పేందుకు సినీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశమే ఇందుకు నిదర్శనమంటూ ప్రస్తావించారు.

Read More : Corona Restrictions : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్..కరోనా ఆంక్షలు మరోసారి పొడిగింపు

బాలీవుడ్‌ను అప్రతిష్ట పాల్జేసేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, మహారాష్ట్ర నుంచి బాలీవుడ్‌ను నోయిడాకు తరలించేందుకే… ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసును బూచిగా బీజేపీ నేతలు చూపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు నవాబ్‌ మాలిక్. షారూఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌ తర్వాత ఎన్సీబీ ముంబై జోనల్‌ డైరక్టర్‌ సమీర్‌ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు నవాబ్‌ మాలిక్. బాలీవుడ్ ప్రముఖులను సమీర్‌ వాంఖడే బెదిరించి డబ్బులు వసూలుచేశారని తాను వ్యక్తిగత వైరంతో ఈ ఆరోపణలు చేయట్లేదని, అన్నిటికీ ఆధారాలున్నాయని చెబుతున్నారు.

Read More : Telangana Dalit Man: గల్ఫ్‌లో 20ఏళ్ల పాటు ఖైదుగా ఉంటూ సాయమందక తెలంగాణ దళితుడి మృతి 

నవాబ్‌ మాలిక్.సమీర్‌ వాంఖడే ఎన్నో తప్పులు చేశాడని, అరెస్ట్ కాకుండా ఉండేందుకే ముంబై హైకోర్టును ఆశ్రయించాడని అన్నారు నవాబ్ మాలిక్. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడ్డాడని, కోర్టును ఎందుకు ఆశ్రయించాడని  ప్రశ్నించారు. తాజాగా బాలీవుడ్‌ను నోయిడాకు తరలించేందుకు కుట్ర జరిగిందంటూ చేసిన ఆరోపణలతో హిందీ చిత్రపరిశ్రమలో కలకలం రేగింది.