అసోంలో భూకంపం..రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు

  • Published By: bheemraj ,Published On : November 13, 2020 / 07:48 AM IST
అసోంలో భూకంపం..రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు

Updated On : November 13, 2020 / 8:11 AM IST

Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్ల‌వారుజామున 3.23 గంట‌ల‌కు స్వ‌ల్ప‌ భూకంపం సంభ‌వించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 3.7గా న‌మోదు అయింది. క‌ర్బీ అంగ్లాంగ్‌ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మొల‌జీ ప్ర‌క‌టించింది.



అక్టోబ‌ర్ మొద‌టివారంలో కూడా భూమి కంపించింది. గ‌త నెల 3న‌ గువాహటి స‌మీప ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. గువాహ‌టికి ప‌శ్చిమాన 51 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. భూ అంత‌ర్భాగంలో 10 కిమీ లోతులో భూమి కంపించంద‌ని ఎన్‌సీఎస్ వెల్ల‌డించింది.