Delhi earthquake: ఢిల్లీ ప్రజలను వణికించిన భూప్రకంపనలు.. ఇండ్ల నుంచి బయటకు పరుగులు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Delhi earthquake: ఢిల్లీ ప్రజలను వణికించిన భూప్రకంపనలు.. ఇండ్ల నుంచి బయటకు పరుగులు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..

Delhi Earthquake

Updated On : February 17, 2025 / 7:58 AM IST

Delhi earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 5.36 గంటల సమయంలో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్దపెద్ద శబ్దాలుసైతం రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.

Also Read: Groom Collapses : పెళ్లిలో తీవ్ర విషాదం.. గుర్రం ఎక్కిన కాసేపటికే పెళ్లి కొడుకు మృతి.. షాక్ లో బంధుమిత్రులు, గెస్టులు..

దేశ రాజధాని ఢిల్లీలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. తెల్లవారు జామున సంభవించిన భూకంప కేంద్రం లోతు కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. ధౌలా కువాన్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారి తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఒక సరస్సు ఉంది. గతంలోనూ ఈ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 2015లో కూడా ఈ ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం నమోదైంది.

Also Read: అతి భారీ తిమింగలం నన్ను నోట్లో కరుచుకుని పట్టుకుంది.. ఆ సమయంలో నేను.. భయానక అనుభవాన్ని చెప్పిన యువకుడు

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాధి రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ప్రతిఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.’’ అని మోదీ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఢిల్లీలోని ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112 కు డయల్ చేసి మాకు సమాచారం ఇవ్వండి.. వెంటనే మేము మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  ఇదిలాఉంటే.. ఘజియాబాద్ నివాసి ఒకరు ఏఎన్ఐ తో  మాట్లాడుతూ.. భూప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ప్రకంపనలు చూడలేదు. భవనం మొత్తం ఊగిపోయింది. అని పేర్కొన్నాడు.