మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఈసీ కీలక నిర్ణయం
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున COVID ప్రోటోకాల్‌లను ఎలా అనుసరిస్తారనే దానిపై బ్లూప్రింట్ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు (HC) ఎన్నికల కమిషన్ (ECI) ను కోరిన తరువాత

Ec Bans Election Victory Rallies
EC Bans Election Victory Rallies : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున COVID ప్రోటోకాల్‌లను ఎలా అనుసరిస్తారనే దానిపై బ్లూప్రింట్ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు (HC) ఎన్నికల కమిషన్ (ECI) ను కోరిన తరువాత, పోల్ బాడీ మంగళవారం సమావేశమై.. కీలక నిర్ణయం తీసుకుంది.. మే 2న ఐదు రాష్ట్రాల ఫలితాల వెల్లడి నేపథ్యంలో జరిగే విజయయాత్రలను ఈసీ నిషేధించింది.. ఈసి జారీ చేసిన నోటీసు ప్రకారం, సంబంధిత రిటర్నింగ్ అధికారి నుండి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని స్వీకరించడానికి గెలిచిన అభ్యర్థి తోపాటు మరొ ఇద్దరికి మాత్రమే అనుమతినిచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ పేర్కొంది.
కాగా తమిళనాడులో COVID కేసులు కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలను నిరోధించలేదని మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్ ను నిందించింది. రాష్ట్రంలో మహమ్మారి సెకండ్ వేవ్ కు EC ఏకైక కారణమని హైకోర్టు ఆరోపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రజారోగ్యం ముఖ్యమని రాజ్యాంగ అధికారులు గుర్తుంచుకోకపోవడం బాధగా ఉందని, ఇకనైనా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే మే 2న ఓట్ల లెక్కింపును నిలిపివేస్తామని హెచ్చరించారు.