ఆర్మీని “మోడీ సేన” అంటావా! : కేంద్రమంత్రికి ఈసీ వార్నింగ్

ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 01:29 PM IST
ఆర్మీని “మోడీ సేన” అంటావా! : కేంద్రమంత్రికి ఈసీ వార్నింగ్

ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.

ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో మరోసారి ఈ విధమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.ఎలక్షన్ ప్రచారంలో సెక్యూరిటీ ఫోర్సెస్ కి సంబంధించిన అంశాల గురించి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నఖ్వీకి  షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు నఖ్వీ అంగీకరించారు.
Also Read : కాంగ్రెస్ కు షాక్ : చౌకీదార్ చోర్ హై ప్రకటనపై ఈసీ బ్యాన్

ఏప్రిల్‌-3,2019న ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ లో బీజేపీ తరపున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నఖ్వీ మాట్లాడుతూ.జ…ఉగ్ర శిబిరాలపై వాయుసేన దాడిచేసి వారిని హతమార్చింది. ఇది మామూలు విషయం కాదు. సమస్య ఏంటంటే.. మోడీజీ సేన చేసిన ఈ దాడులపై ఆధారాలు కావాలని విపక్ష నాయకులు అడుగుతున్నారని అన్నారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి,ఎస్పీ నేత అజంఖాన్ పై ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే.