Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది....

Road Accident
Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరణాసిలో బుధవారం తెల్లవారుజామున కారు ట్రక్కును ఢీకొనడంతో 8 మంది మరణించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన జరిగింది. వారణాసి-లక్నో హైవేపై బెనారస్ నుంచి పిలిభిత్ వైపు వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌తో సహా 8 మంది మృతి చెందగా, 3 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది.
Flash floods : సిక్కింలో మెరుపు వరదలు…23 మంది జవాన్ల గల్లంతు
పోలీసులు మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరణాసి రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారికి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.