బీజేపీ దెబ్బకొడుతుందని 8నెలల క్రితం హింటిచ్చాడు..ఇప్పుడు ప్రభుత్వాన్ని తానే కూల్చేస్తున్నాడు!!

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 07:28 AM IST
బీజేపీ దెబ్బకొడుతుందని 8నెలల క్రితం హింటిచ్చాడు..ఇప్పుడు ప్రభుత్వాన్ని తానే కూల్చేస్తున్నాడు!!

Updated On : March 11, 2020 / 7:28 AM IST

బీజేపీ బ్యాక్ డోర్ (దొడ్డిదారి) రాజకీయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటమే తప్ప రాజ్యాంగపరంగా ఎన్నికల్లో ప్రత్యర్ధులను ఎదురొడ్డి అధికారంలోకి రావటం చేతకాదని మాజీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా సరిగ్గా ఎనిమిది నెలల క్రితం BJPపై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసిన సమయంలో కూడా సింధియా  గద్దెనెక్కటానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందనీ..దేనికైనా దిగజారుతుందని సింధియా తీవ్ర విమర్శలు చేశారు.

కానీ ఇప్పుడు బీజేపీపై విమర్శలు చేసిన ఆ సింధియానే స్వయంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయటనాకి సిద్ధపడ్డారు. 20మంది ఎమ్మెల్యేలతో జంప్ అయ్యారు. బీజేపీని విమర్శించి ఆ బిజేపీలోకి  చేరటానికే సిద్ధపడుతున్నారు.

(ప్రభుత్వాలను కూల్చటంతో బిజీగా ఉన్నబీజేపీ పెట్రోల్ ధరలు తగ్గటం గమనించలేదేమో )

రాజకీయంలో శాశ్వత మిత్రులు..శాశ్వత శతృవులు ఉండనా సింధియా మరోసారి రుజువు చేశారు. బీజేపీపై మక్కువతోనే లేదా..తనకు సీఎం పదవి దక్కలేదనే అక్కసుతోనే గత కొంతకాలం నుంచి  సింధియా బీజేపీ తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగానే ప్రశంసిస్తున్నారు. అదే క్రమంలో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
 

2016లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శి సింధియా మోడీపై గతంలో తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ద్వేషపూర్తి రాజకీయాలను ప్రోత్సహిస్తుందనీ..కానీ మా అధినేత సోనియా గాంధీతో పెట్టకుంటే బీజేపీ పతనం కాక తప్పదనీ విమర్శించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాపటర్ కుంభకోణం విషయంలో..సోనియాగాంధీని విమర్శిస్తే  సోనియా గాంధీని సింహంతో పోల్చారు జ్యోతిరాదిత్య. ఆమెది సింహరాశి..ఆమె సింహంలాంటివారు..ఆమెను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వం,ప్రధాని మోడీ పశ్చాత్తాపపడక తప్పదంటూ  సోనియాగాంధీ పలు విమర్శలు చేశారు. 

బీజేపీలో అధికారంలో ఉన్నసమయంలో కూడా మోడీపై విమర్శల వర్షం కురిపించారు సింధియా. ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో బీజేపీకి బాగా తెలుసనీ..అరుణాచల్ ప్రదేశ్,మణిపూర్, గోవాలలో బీజేపీ అదే చేసిందని విమర్శించారు. అంతేకాదు పుల్వామా దాడి విషయంలో బీజేపీ ప్రభుత్వంపై సింధియా విరుచుకుపడ్డారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా అమరవీరులకు కాంగ్రెస్ నివాళులు అర్పించిన సభలో సింధియా బీజేపీని విమర్శిస్తూ..పుల్వామా దాడి విషయంలో ప్రభుత్వం విచారణ సరిగ్గా చేయాలేదనీ..దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల పట్ల ప్రభుత్వం చూపించే గౌరవం ఇదేనా? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇలా ఒకటీ రెండూ సందర్బాలు కాదు పలు కీలక అంశాలపై సింధియా ప్రధాని మోడీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడేవారు. కానీ..ఏ కాంగ్రెస్ కోసమైతే కష్టపడేవారో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కూల్చటానికి ఎమ్మెల్యేలతో బైటకెళ్లిపోయారు. ఏ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మధ్యప్రదేశ్ లో సింధియా కష్టపడ్డారో ఆ కాంగ్రెస్ కే వెన్నుపోటు పొడిచి.. ఏ బీజేపీనైతే ఆయన విమర్శించేవారో..ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. 

ఇటీవల కాలంలో సీఎం పదవి దక్కకపోవటంతో కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు..సీఏఏ వంటి విషయాల్లో బీజేపీకి సింధియా మద్దతు పలికారు. దీంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కలకలం రేగింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా ఆ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. బీజేపీ దొడ్డిదారి రాజకీయాలు చేస్తుందనీ..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించిన ఆయనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి..ప్రజలు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తీసుకుని బైటకెళ్లిపోయి..ప్రభుత్వాన్ని కూల్చటానికి తానే కారణంగా మారారు జ్యోతిరాదిత్యసింధియా.దటీజ్  పాలిట్రిక్స్..!!

See Also | కరోనా దెబ్బకు ఇటలీకి తాళం : నిర్భందంలో వందలాది తెలుగు విద్యార్థులు