Road Accident : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

Road Accident : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

Up Accident

Updated On : July 25, 2022 / 10:13 AM IST

road accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. సోమవారం (జులై25,2022) ఉదయం బారాబంకి జిల్లాలోని నరేంద్రపుర మద్రహా వద్ద పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు స్లీపర్‌ కోచ్‌ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు పోలీసులు మృతి

రెండు బస్సులు బీహార్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్నాయని పోలీసులు తెలిపారు. ఒక బస్సును మరో బస్సు ఓవర్‌ టేక్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. ఒక బస్సు ఎడమ భాగం మొత్తం ధ్వసంమయిందని తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.