Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా షిండే గ్రూప్ ఎత్తుగడలు వేస్తోంది. విచారణకు రాకపోతే డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారని అనుమానం.

Supreme Court
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు తిరిగింది. ఏక్ నాథ్ షిండే గ్రూప్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హత నోటీసు ఇచ్చే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని రెబల్ ఎమ్మెల్యేలు అంటున్నారు. రేపు ముంబయిలో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ అన్నారు. స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా షిండే గ్రూప్ ఎత్తుగడలు వేస్తోంది. విచారణకు రాకపోతే డిప్యూటీ స్పీకర్ అనర్హత వేటు వేస్తారని అనుమానం.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో రాజ్‌భవన్ రంగంలోకి దిగింది. కోవిడ్ నుంచి కోలుకుని ఉదయమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి రాజకీయ సంక్షోభంపై దృష్టిపెట్టారు. రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇళ్లపై దాడులు జరుగుతుండటంతో వారికి భద్రత కల్పించాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ముంబయి సీపీకి కూడా గవర్నర్ లేఖ రాశారు.
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో గవర్నర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం అది చివరి ఆప్షనే కావొచ్చంటున్నారు. రెబల్స్‌తో కలిపి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గ్యారెంటీ అంటున్నారు.