హంద్వారాలో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు. కశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఫిబ్రవరి 28 రాత్రి ఒంటిగంట సమయంలో ఎన్ కౌంటర్లో చెటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను సీఆర్పీఎస్ జవాన్లు మట్టుపెట్టారు. హంద్వారాలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భారత్ జవాన్లు కాల్పులు జరిపారు. దీంతో టెర్రరిస్టులు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు పౌరులకు కూడా గాయాలయ్యాయి.
క్రమంలో ఊరి సెక్టార్ లో కూడా భారత్ జవాన్లను టార్గెట్ గా కాల్పులు జరుపుతున్న క్రమంలో సెర్చ్ ఆపరేషన్ ను భారత్ కొనసాగిస్తునే ఉంది. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు..కేంద్రానికి భారతఆర్మీనివేదికలను అందజేస్తోంది.పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తలతో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ దాడి అనంత పాక్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానికా దళం చేసిన సర్జికల్ దాడులతో రగిలిపోతున్న క్రమంలో ఉగ్రవాదులు భారత ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేస్తు..కాల్పులకు పాల్పడుతునే ఉన్నా..భారత్ జవాన్లు వారిని మట్టి కరిపిస్తునే ఉన్నారు.