municipal jobs scam case : ఉద్యోగాల స్కాం కేసులో బెంగాల్ మంత్రి ఈడీ సోదాలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు....

Minister Sujit Bose
municipal jobs scam case : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణంలో ఆ రాష్ట్ర మంత్రితోపాటు పలువురి ఇళ్లపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. 2014, 2018 మధ్య పలు పౌర సంస్థల్లో జరిగిన మునిసిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రదేశాల్లో సోదాలు జరిపింది. బెంగాల్ ఫైర్ సర్వీసెస్ మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన రెండు ఇళ్లు, తృణమూల్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది.
ALSO READ : North Korea : ఉత్తర కొరియా 2020 లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి పర్యాటకులకు అనుమతి
శుక్రవారం ఉదయం 6.40 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు బెంగాల్ రాష్ట్రంలో సంచలనం రేపాయి. 2023లో కలకత్తా హైకోర్టు మున్సిపాలిటీల రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పౌర సంస్థలు చేసిన రిక్రూట్‌మెంట్‌లలో జరిగిన అవకతవకలపై ఈడీ, సీబీఐ రెండూ దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయి. నదియా, హుగ్లీ,నార్త్ 24 పరగణాస్ జిల్లాలు, సాల్ట్ లేక్ మునిసిపాలిటీలోని పలు పౌర సంస్థల నుంచి ఈడీ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ALSO READ : Covid sub-variant JN.1 : దేశంలో 15 రాష్ట్రాల్లో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి
ఈ కేసుపై సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిక్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి అక్టోబరు 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫుడ్ అండ్ సప్లైస్ మంత్రి రథిన్ ఘోష్ నివాసంతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది.