చంద్రయాన్ 2పై మళ్లీ ఆశలు : 12 రోజుల్లో సిగ్నల్స్ రాకపోతే పరిస్థితి ఏంటీ?

చంద్రయాన్ 2పై మళ్లీ ఆశలు : 12 రోజుల్లో సిగ్నల్స్ రాకపోతే పరిస్థితి ఏంటీ?

Updated On : September 9, 2019 / 10:09 AM IST

చంద్రయాన్ 2 సక్సెస్ అయ్యిందా లేదా అనేది తేలిపోవటానికి మరో 12 రోజుల సమయం ఉంది అంటున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. ఆశలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయంటూ శుభవార్త కూడా చెప్పారు. 2 కిలోమీటర్ల ఎత్తులో కట్ అయిన సిగ్నల్స్‌తో అయోమయం నెలకొంది మొదట్లో. ఆర్బిటర్ నుంచి వచ్చిన సమాచారంతో.. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై ల్యాండ్ అయినట్లు స్పష్టం అయ్యింది. అంతేకాదు.. ఒక్కటిగానే ఉందని కూడా వెల్లడించింది ఇస్రో. అంటే సేఫ్ ల్యాండింగ్ అయినట్లు కన్ఫామ్. 

అదే విధంగా విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్నా కూడా బయటకు రాలేదని కూడా ఆర్బిటర్ పంపిన సమాచారంతో తేలిపోయింది. సో.. ల్యాండర్ విక్రమ్ ఎలాంటి డ్యామేజ్ కాలేదని నిర్థారణకు వచ్చింది ఇస్రో. సో.. ఇక సిగ్నల్స్ వస్తే మాత్రం ఫుల్ హ్యాపీ. దానికి కూడా 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్నా లైఫ్ టైం 14 రోజులు మాత్రమే. ఈలోపు సిగ్నల్ అంది.. రోవర్ బయటకు వస్తే మాత్రం ప్రయోగం సక్సెస్ అయినట్లే. 

అలా కాకుండా శనివారం నుంచి 14 రోజుల వరకు సిగ్నల్స్ అందుకోలేకపోతే మాత్రం చంద్రుని చేరగలిగాం. కానీ, ఫలితం రాబట్టలేకపోయామని ఊరుకోవాల్సిందే. ఇదే విషయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేటుగా అయినా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఇస్రో చైర్మన్ కె శివన్ మాట్లాడుతూ.. చంద్రుని ఉపరితలంపై 100 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ల్యూనార్ ఏరియాలో సిగ్నల్స్ కోల్పోయాం. తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ 12 రోజులు చాలా చాలా కీలకం అని అన్నారు. ఒక్కసారి సిగ్నల్స్ ను అందుకోగలిగితే.. మిగతాది అంతా చకచకా అయిపోతుందన్నారు.ఈ 12 రోజులూ చంద్రయాన్ 2పై ఆశలు సజీవంగానే ఉంటాయని వెల్లడించారాయన. ఆ తర్వాతే ఆశలు వదులుకోవటం జరుగుతుందన్నారు.

ఏమైనా జరగొచ్చు. చంద్రయాన్ 1 ప్రయోగం సమయంలోనూ ఆర్బిటర్ అనుకున్నదాని కంటే ఎక్కువ రోజులే పని చేసింది. ఇప్పుడు కూడా 14 కాదు.. నెల రోజులు అయినా ల్యాండర్, రోవర్ పని చేయొచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇన్ని రోజులు కచ్చితంగా పని చేయాలి అని పెట్టుకుంటారు.. ఆ తర్వాత వర్క్ చేస్తే అది బోనస్ కిందకు వస్తుంది అంటున్నారు యువ శాస్త్రవేత్తలు. హార్డ్ ల్యాండింగ్ అయినా.. సేఫ్‌గా ఉందన్న సమాచారంతో దేశం మొత్తం ఇప్పుడు మళ్లీ ఇస్రో వైపు ఆశగా చూస్తోంది.. ఆల్ ద బెస్ట్ ఇస్రో.