రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ క్యాన్సిల్ అవడానికి వెనకున్న కారణం

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ క్యాన్సిల్ అవడానికి వెనకున్న కారణం

Updated On : December 31, 2020 / 12:45 PM IST

మహమ్మారి ప్రబలుతున్న సమయంలో రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీని క్యాన్సిల్ చేస్తున్నానని… అభిమానులంతా తనను క్షమించాలంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతకంటే ముందు ఈ తమిళ మెగాస్టార్ హైదరాబాద్ హాస్పిటల్‌లో బీపీ కారణంగా మూడు రోజుల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుని కోలుకున్నారు. గతంలో చాలా సార్లు ఆధ్యాత్మికతతో కూడిన స్టేట్‌మెంట్స్ చేసిన రజినీ.. ఈ సారి కూడా అలాగే చెప్పాడు. ‘ఇలా హాస్పిటల్ పాలవడం దేవుడిచ్చిన హెచ్చరికలా ఫీల్ అవుతున్నాను. నా ప్రచారం మహమ్మారి సమయంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందనుకుంటున్నా’ అని చెప్పాడు.

రెండు దశాబ్దాలుగా పొలిటికల్ ఎంట్రీ గురించి ఊరిస్తున్న రజినీ.. డిసెంబర్ 2017లో ఇక వచ్చేస్తానంటూ చెప్పారు. అప్పటి నుంచి జరిగిన ప్రయత్నాల్లో పార్టీ పేరు ప్రకటించడం, ఇటీవల కీలక ప్లానింగ్ లు కూడా చేసుకున్న తలైవా.. ఇక రెండ్రోజుల్లో రజినీ పొలిటికల్ పార్టీ గురించి జనవరి 2021లో మాట్లాడుకుంటారని అనుకుంటున్న సమయంలో కీలక ప్రకటన చేశారు. తమిళనాడులో మే2021న ఎన్నికలు జరగనున్నాయి.

ఇటీవల అతని సినిమా ప్రొడక్షన్ యూనిట్ లో కొద్ది మంది సభ్యులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చేర్చారు.

చాలా మంది అభిమానులు రజినీ ఆరోగ్యం కారణంతో రాజకీయాల్లో రాకపోవడంపై అనాసక్తిగా ఉన్నారు. ఎందుకంటే మరి కొద్ది నెలల్లో జరగాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికలకు చాలా మంది నాయకులు బాగానే ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇంకా రజినీ ఎంట్రీ బీజేపీకి బాగా కలిసొచ్చేలాగే అనిపించింది. ఓ యాంటీ ద్రవిడియన్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతిపరంగా, ఆధ్మాత్మికంగా ఓటర్లను రాబట్టాలనుకుంది.

నిజానికి కొద్దిపాటి బ్లడ్ ప్రెజర్ ఫ్లక్చుయేషన్ రజినీని రాజకీయాలకు దూరం అయ్యేలా చేసిందా అని విమర్శకులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగిన సమావేశం కారణంగా అంచనా ప్రకారమే రజినీ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు అంటున్నారు. పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పినప్పుడే రజినీహెల్త్ కండిషన్ ఇలాగే ఉంది.

అపోలో హాస్పిటల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మెడికల్ బుల్లెటిన్ లో స్పష్టం చేసిన దానిన బట్టి డాక్టర్లు కౌన్సిలింగ్ చేసి కొవిడ్-19 వ్యాప్తి జరిగే పనులు చేయొద్దని అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలనుకున్న రజినీ ఎట్టకేలకు సక్సెస్‌ఫుల్‌గా రిస్క్ నుంచి బయటపడ్డాడు’ అని చెప్తున్నారు రజినీ విమర్శకులు.