Minister KTR: చందన్వెల్లిలో వెల్స్పన్ పరిశ్రమ యూనిట్.. 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక్క పరిశ్రమా లేదన్న కేటీఆర్
రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వెల్స్పన్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చందన్వెల్లిలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్ స్పన్ కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ తో పాటు రంగారెడ్డిజిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఐటీ విస్తరించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్స్పన్ నిర్ణయం బలోపేతం చేస్తుందన్నారు.

Minister KTR
Minister KTR: రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ వెల్స్పన్ పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెల్స్పన్ కంపెనీ చైర్మన్ బీకే గోయెంకాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. చందన్వెల్లిలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్ స్పన్ కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ తో పాటు రంగారెడ్డిజిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఐటీ విస్తరించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్స్పన్ నిర్ణయం బలోపేతం చేస్తుందన్నారు.
తమ ప్రాంతంలోనూ గచ్చిబౌలి, కొండాపూర్, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతల మాదిరిగా ఐటీ కంపెనీలు ఏర్పాటు కావాలన్న స్థానిక ప్రజల ఆకాంక్ష కూడా వెల్స్పన్ కేంద్రం ఎర్పాటుతో నెరవేరుతుందన్నారు. ఇక్కడి స్థానిక యువకులకు సైతం ఐటీ ఉద్యోగాలు చేసుకునేందుకు ఈ సెంటర్ లో అవకాశం లభిస్తుందని చెప్పారు. దాదాపు 1,200 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
వెల్స్పన్ కంపెనీ రాకముందు చందన్వెల్లి, సీతారాంపూర్ లాంటి ప్రాంతాల్లో మచ్చుకు ఒక్క పరిశ్రమ అయినా కనిపించేది కాదని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల్లో అనేక కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి కంపెనీలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయని మంత్రి అన్నారు. ఇప్పుడు ఈ ఐటీ కేంద్రం ఏర్పాటుతో మరిన్ని చిన్న మధ్య తరహా కంపెనీలు ఈ ప్రాంతపైపు దృష్టి సారిస్తాయన్న అశాభావం వ్యక్తం చేశారు.
కాగా, కంపెనీ చైర్మన్ బాలకృష్ణ గొయెంకా మాట్లాడుతూ చందన్వెల్లి ప్రాంతంలో ప్రస్తుతం వెల్స్పన్ కంపెనీ కొనసాగిస్తున్న తన పెట్టుబడులకు అదనంగా ఈ ఐటీ, ఐటీఈయస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో తమ కంపెనీ ఐటీ రంగంలో శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను కూడా తమ కంపెనీ తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లే యువకులు, చందన్వెల్లిలోను పనిచేసే స్థాయిలో తమ ఐటీ సెంటర్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భవిష్యత్తులో చందన్వెల్లి ప్రాంతంలోనూ ఐటీ కార్యకలాపాలు విస్తృతం అవుతాయన్నారు. వెల్స్పన్ కంపెనీ ఇప్పటికే ఐటీ, ఐటీఈఎస్ రంగంలో అహ్మదాబాద్, ముంబైలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా చందనవెల్లిలో తమ పారిశ్రామిక ప్రాంగణంలో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
Tremors felt in Delhi-Chennai: ఢిల్లీ, చెన్నైలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు