Fact Check: ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ ఇస్తోందంటూ మెసేజ్ మీకూ వచ్చిందా.. ఒక్కసారి ఇది చదవండి

భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందించడం ద్వారా విద్య డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది.

Fact Check: ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ ఇస్తోందంటూ మెసేజ్ మీకూ వచ్చిందా.. ఒక్కసారి ఇది చదవండి

Updated On : June 30, 2025 / 12:11 AM IST

Fact Check: కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ ఇస్తోంది అంటూ ఓ మేసేజ్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతోంది. అలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా? మరి ఇందులో నిజం ఎంత? నిజంగానే కేంద్రం అలాంటి స్కీమ్ ఒకటి అమలు చేస్తోంది? అనే వివరాల్లోకి వెళితే.. ఆ మెసేజ్ ఫేక్ అని తేలింది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్ టాప్ లు అందజేస్తోందని వాట్సాప్ లో వైరల్ అవుతున్న మేసేజ్ పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (PIB ఫ్యాక్ట్ చెక్) స్పందించింది.

అందులో నిజం లేదని తేల్చింది. కేంద్రం ఉచిత ల్యాప్ టాప్ లు ఇవ్వడం లేదంది. ఫేక్ ప్రచారాలను నమ్మొద్దంది. అంతేకాదు.. అది మోసపూరిత లింక్‌ అని, పొరపాటున కూడా దానిపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. సైబర్ క్రిమినల్స్ పంపే ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. అనవసర లింక్ లు క్లిక్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. అనుమానం వస్తే అధికారవర్గాల ద్వారా వెరిఫై చేసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది.

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకం కింద విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నట్లు వాట్సాప్‌లో సర్కులేట్ అవుతున్న సందేశం నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (PIB ఫ్యాక్ట్ చెక్) స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో కూడిన వైరల్ సందేశం ఇలా ఉంది. “అర్జంట్: భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందించడం ద్వారా విద్య డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ అధికారిక సైట్‌ను సందర్శించి అర్హతను తనిఖీ చేయండి https://education.gov.in@tinyurl.com/IndiaFreeLaptop-413.”

ఇంకా ఆ సందేశంలో ఏముందంటే.. ”నేర్చుకోవడానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌లను అందిస్తుంది. ల్యాప్‌టాప్ అందుకునే విజయవంతమైన విద్యార్థుల్లో మీరూ భాగం కండి” అని ఉంది. దీనిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇది నకిలీదని పేర్కొంది. అంతేకాదు ఆ సందేశంలోని మోసపూరిత లింక్‌పై క్లిక్ చేయవద్దని పౌరులను హెచ్చరించింది.

Also Read: నరకం చూశారు.. 32 గంటలు ట్రాఫిక్ జామ్.. చిక్కుకుపోయిన 4వేల వాహనాలు.. ముగ్గురు మృతి..

”ఈ సందేశం నకిలీది. URL మోసపూరితమైనది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు. అటువంటి సందేశాలను ఎప్పుడూ అధికారిక వర్గాల ద్వారా మాత్రమే ధృవీకరించండి” అని PIB ఫ్యాక్ట్ చెక్ X లోని ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఆన్‌లైన్ మోసాలు, తప్పుడు సమాచారం, ముఖ్యంగా ప్రభుత్వ బ్రాండింగ్ లేదా చిత్రాలను దుర్వినియోగం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచించారు. ధృవీకరించబడిన సమాచారం కోసం “.gov.in” తో ముగిసే ప్రభుత్వ వెబ్‌సైట్లను మాత్రమే చూడాలని, ప్రకటనల కోసం అధికారిక ఛానెల్‌లను ఫాలో కావాలని ప్రజలకు సూచించారు అధికారులు.