తన కూతురుకు కరోనా ఉందని చెప్పిన తండ్రి..కోర్టులో నిలిచిన వివాహం

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 07:46 AM IST
తన కూతురుకు కరోనా ఉందని చెప్పిన తండ్రి..కోర్టులో నిలిచిన వివాహం

Updated On : July 26, 2020 / 8:41 AM IST

తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటన ఇండోర్ లో చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Bhalai village గ్రామానికి చెందిన ఓ జంట తన స్నేహితులతో కలిసి Khandwa జిల్లా కోర్టుకు వచ్చారు. అక్కడ వివాహం కోసం అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్వకేట్ వీరేంద్ర వర్మ పత్రాలు సేకరిస్తున్నారు. ఒక్కసారిగా..బాలిక (19) తండ్రి సీన్ లోకి వచ్చారు.

తన కూతురుకు కరోనా ఉందంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. దీంతో అందరూ భయపడిపోయారు. అమ్మాయిని విడిచిపెట్టాలని కోరాడు. కానీ ఆ జంటకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని, వారి కుటుంబానికి ఈ వివాహం ఇష్టం లేదని అనిపిస్తోందని వర్మ వెల్లడించారు.

వివాహాన్ని నిలిపివేయాలని కరోనా నాటకం ఆడి ఉండవచ్చునని తెలిపారు. తన ద్వారా కూతురుకు సోకిందని తండ్రి తెలిపాడన్నారు. కోర్టు వద్దనున్న వారు..పనులను ఆపి వేసి ఇంటికి వెళ్లిపోవడం జరిగిందన్నారు.

తాను ఇంటికి చేరుకున్న వెంటనే స్నానం చేసి వేడి నీటిని తాగానని న్యాయవాది వర్మ తెలిపారు. ఇక బాలికకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఫలితం కోసం ఎదురు చూస్తున్నరు. ముందు జాగ్రత్తలో భాగంగా…నిబంధనల ప్రకారం ఆమెను 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచారు.