Fuel Tank : వాహనదారులకు అలర్ట్.. ఫ్యూయల్ ట్యాంక్‌ని ఫుల్‌గా నింపడం చాలా డేంజర్..? ఇందులో నిజమెంత

Fuel Tank: ఫుల్ ట్యాంక్‌ని పెట్రోల్‌తో ఫుల్‌గా నింపితే పేలుడు జరిగే ప్రమాదం ఉంది. ఇంధన ట్యాంకుని కేవలం సగం పెట్రోల్‌తోనే నింపి, మిగతాది గాలికి వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పేలుడు జరిగే ప్రమాదం ఉండదని ఆ మేసేజ్‌లో ఉంది.

Fuel Tank : వాహనదారులకు అలర్ట్.. ఫ్యూయల్ ట్యాంక్‌ని ఫుల్‌గా నింపడం చాలా డేంజర్..? ఇందులో నిజమెంత

Fuel Tank (Photo : Google)

Updated On : April 30, 2023 / 9:06 PM IST

Fuel Tank : సోషల్ మీడియా పుణ్యమా అని ఫేక్ న్యూస్ లు తెగ పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తల్లో చాలావరకు ఫేక్ ఉంటున్నాయి. అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే జనాలు వాటిని ఫార్వార్డ్ చేస్తున్నారు. ఈ కారణంగా ఆ తరహా వార్తల సంఖ్య బాగా పెరిగిపోయింది.

తాజాగా అలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ న్యూస్ వాహనదారులను భయపెట్టేలా ఉంది. వారిని తప్పుదోవ పట్టించేలా ఉంది. ఇంతకీ ఆ మేసేజ్ ఏంటంటే.. వాహనదారులు తమ వాహనాల ఇంధన ట్యాంక్ లను గరిష్ట సామర్థ్యంతో (అంటే ట్యాంక్ ఫుల్) నింపకూడదని. అలా చేస్తే చాలా ప్రమాదం అని, వాహనం పేలిపోయే ఛాన్స్ ఉందని అందులో ఉంది.

వాహన యజమానులు తమ వాహనాల్లోని ఇంధన ట్యాంకులను గరిష్ట పరిమితికి నింపొద్దని అందులో హెచ్చరించారు. ఎందుకంటే ఇదసలే వేసవి కాలం. ఇక, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని, ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ కారణంగా పేలుడు జరిగే ప్రమాదం ఉందని. కాబట్టి.. ఇంధన ట్యాంకుని కేవలం సగం పెట్రోల్ తోనే నింపండి, మిగతాది గాలికి వదిలేయండి, ఇలా చేయడం వల్ల పేలుడు జరిగే ప్రమాదం ఉండొదు అని ఆ మేసేజ్ లో ఉంది.

Also Read..King Cobra : OMG.. ప్రాణాలను పణంగా పెట్టి భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో ఈ మేసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోగో ఉండటంతో.. ఇది నిజమేనేమో అని చాలామంది నమ్మేశారు. ఈ పోస్ట్‌ను గుడ్డిగా సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. ఇదలా వైరల్ అయిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ బృందం దృష్టికి వెళ్లింది. దాంతో వారు వెంటనే స్పందించారు.

ఆ మేసేజ్ లో వాస్తవం లేదని PIB fact check తేల్చి చెప్పింది. వైరల్ అయిన పోస్ట్‌ నకిలీదని, తప్పుదారి పట్టించేదని స్పష్టం చేసింది. ఇక దీనిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా స్పందించింది. వాహనాల ఫ్యూయల్ ట్యాంకులను ఫుల్ గా నింపడం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు. అంతేకాదు, శీతాకాలం లేదా వేసవి.. కాలంతో సంబంధం లేకుండా వాహనాల తయారీదారులు పేర్కొన్న పరిమితి (గరిష్టంగా) వరకు వాహనాల్లో ఇంధనాన్ని నింపడం కచ్చితంగా సురక్షితం” అని IOCL ట్వీట్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మేసేజ్ ఫేక్ అని తేల్చేసింది PIB fact check. ఇంధన ట్యాంక్ ని ఫుల్ గా నింపే విషయంలో వాహనదారులు ఎలాంటి అనుమానాలు, అపోహలు, భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్టేట్ మెంట్ ఇచ్చింది.

Also Read..Delhi Metro : వామ్మో.. అమ్మాయేనా? తూలుతూ, ఊగుతూ, బూతులు తిడుతూ.. మెట్రోలో యువతి రచ్చ రచ్చ

వైరల్ మేసేజ్ : IOCL హెచ్చరిక జారీ చేసింది. మీ వాహనంలో ఇంధన ట్యాంక్ ను గరిష్ట పరిమితికి నింపవద్దని వాహనదారులను కోరింది.

వాస్తవం : ఇది నకిలీ వార్త. తప్పుదారి పట్టించేది. వాహన తయారీదారు పేర్కొన్న పరిమితి (గరిష్టంగా) వరకు వాహనాల్లో ఇంధనాన్ని నింపడం ఖచ్చితంగా సురక్షితం.