ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలోని ఓ ఫర్నీచర్ గోదాంలో శనివారం(డిసెంబర్ 14, 2019) తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంకు ఎదురుగా ఉన్న బల్బుల ఫ్యాక్టరీకి మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
21 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. ఫర్నీచర్ గోదాం కనుక మంటలు అదుపు చేయడానికి కష్టంగా మారింది. భారీగా ఆస్తినష్టం జరిగనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరేదైనా కారణమా తెలియాల్సివుంది.
ఇటీవలే ఢిల్లీలోని అనాజ్ మండీలో బ్యాగ్, పేపర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 43 మంది సజీవదహనమయ్యారు. మరో 62 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరవకముందే మరో అగ్నిప్రమాదం జరుగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.